ఉత్తరప్రదేశ్ ఎంపీ, ఢిల్లీ ఆధర్ కార్డు ఉన్న జీవీఎల్ మరోసారి, ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మారు. ప్రతి వారం ఒక రోజు, ఆంధ్రా పై విమర్శలు చెయ్యాలనే అమిత్ షా ఒప్పందం మేరకు, ఈ వారం కూడా వచ్చి తన కోటా పూర్తి చేసుకున్నారు. అలాగే, కుటుంబరావు గారి చేత, ఈ వారం తీసుకోవాల్సిన కోటింగ్ తీసుకుని, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు. జీవీఎల్ తాజగా చేసిన ఆరోపణ, 602 కోట్ల బడ్జెట్ ఉన్న మత్స్యశాఖలో, 6,700 కోట్లు కుంబకోణం జరిగిందని. దీని పై, కుటుంబరావు విలేకరులతో మాట్లాడుతూ, జీవీఎల్ కి వీకెండ్ కోటింగ్ ఇచ్చి పమించారు. వారానికో అబద్ధం ప్రచారం చేసి డిల్లీ వెళ్లడం జీవీఎల్‌కి రివాజుగా మారిందని ఆయన ఆరోపించారు.

gvl 09092018 2

ఏపీలో గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో మత్స్యశాఖకు కేటాయించిన నిధులు రూ.602 కోట్లు కాగా ఇప్పటి వరకు వ్యయం చేసింది రూ.572 కోట్లని వివరించారు. వాస్తవం ఇదైతే రూ.6,700 కోట్లు గోల్‌మాల్‌ ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఒక వేళ జరిగినట్లు ఆధారాలు చూపితే తిరిగి వసూలు చేసి జీవీఎల్‌కు 10 శాతం నిధులు చెల్లిస్తామన్నారు. ఎప్పటికప్పుడు దొంగ నాటకం ఆడడం, ప్రభుత్వంపై బురద జల్లడం రివాజుగా మారిందని ఆయన ఆరోపించారు. అమరావతి బాండ్లను కేవలం 10 మంది దరఖాస్తు చేసుకుని తీసుకొన్నారని, ఆ కంపెనీల సమగ్ర వివరాలు సంబంధిత రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

gvl 09092018 3

బాండ్లు తీసుకున్నవారి వివరాలు తెలుసుకుని బెదిరించటానికి చేస్తున్న వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌ తెలిసిన సంస్థల ప్రతినిధులు విశ్వాసంతో అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చారని వివరించారు. అమరావతి బాండ్లలో అవినీతిని నిరూపించిన పక్షంలో 24 గంటల వ్యవధిలో పదవికి రాజీనామా చేస్తానని కుటుంబరావు సవాల్‌ చేశారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో అవినీతి చోటుచేసుకుందని, రాజా ఆఫ్‌ కరప్షన్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. జగన్‌ అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టే ‘‘క్విడ్‌ ప్రోకో’’ కింద ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని కుటుంబరావు ఆరోపించారు. జగన్‌ అవినీతిపరుడు కాదని మీ దగ్గర ఆధారాలుంటే.. వాటిని కోర్టులో ప్రవేశపెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read