జగన్ పార్టీ బరి తెగిస్తుంది... ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మరింతగా రెచ్చిపోతుంది... ఏకంగా మంత్రినే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు... వైసిపీ నేత వసంత నాగేశ్వర రావు ఆడియో టేప్ బయటకు రావటంతో, ఒక్కసారి స్టేట్ అంతా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదేనా రాజకీయం అంటూ, దుయ్యబట్టారు. దేవినేని ఉమాను హత్య చేస్తామనే రీతిలో బెదిరింపులకు దిగిన మాజీ మంత్రి, వైకాపా నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్‌ చేసిన వసంత నాగేశ్వరావు బెదిరింపులకు పాల్పడ్డారు.

cbn vasantha 10092018 2

అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన సీఎం బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. బెదిరింపులు, హత్యలతో ఎవరూ ఏమీ సాధించలేరని.. ఇలాంటి చర్యలను ఎంతటివారు ప్రోత్సహించినా తీవ్రస్థాయిలో చర్చలుంటాయని హెచ్చరించారు. మంత్రిని హత్య చేస్తాం అనే ధోరణిలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని వ్యూహ కమిటీ సమావేశంలో సీఎం తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో వసంత నాగేశ్వరరావుపై ఇప్పటికే కేసు నమోదైందని అని నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ లోను ఈ విషయం ప్రస్తావన కు తీసుకురావాలని నిర్ణయించారు.

cbn vasantha 10092018 3

గ్రామంలో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఈ నెల 7న సాయంత్రం విధుల్లో ఉన్న తనకు వసంత నాగేశ్వరరావు ఫోన్‌ చేసి తెలుగుదేశం ఏజెంటుగా పనిచేస్తున్నావంటూ బెదిరించారని గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీ మంత్రిని (దేవినేని ఉమాను) ఏమైనా చేస్తామని, అవసరమైతే కడప నుంచి మనుషులను తెప్పిస్తామని మాట్లాడారని కార్యదర్శి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆరా తీశారని.. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వివరించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆడియో టేప్‌ను విన్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని, పరుష పదజాలంతో బెదిరించారన్న అంశంపై వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్‌కిషోర్‌ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read