కాపులకు రిజర్వేషన్ అంటూ హడావిడి చేస్తున్న ముద్రగడ, మరో మారు చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, మరో తిక్క కోరికతో ముందుకు వచ్చారు... చంద్రబాబు కాపులకి రిజర్వేషన్ ప్రకటిస్తూ, ఇప్పటికీ కమిటి వేసి, రిపోర్ట్ తెచ్చుకుని, అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. కేంద్రం మాత్రం ఈ బిల్ పక్కన పడేసింది. అయితే చంద్రబాబు, ఈ విషయం పై కూడా కేంద్రం పై పోరాటం చెయ్యాలని నిర్ణయించారు. ఏ కారణం చేతనో కాని, ముద్రగడ మాత్రం కేంద్రం పై పోరాటం చెయ్యటానికి కాని, కేంద్రాన్ని ఒక్క మాట అనటానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు చంద్రబాబు పోరాటం చేస్తే, తనను ఇంకా ఎవరూ పట్టించుకోరు అనే ఉద్దేశంతో, చంద్రబాబుని మరో ఇబ్బంది పెట్టటానికి రెడీ అయ్యారు ముద్రగడ...

mudragada 10092018 2

కాపు రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రానికి పంపిన బిల్లును చంద్రబాబు ఉపసంహరించుకుని, కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి, గవర్నర్ ఆమోదంతో వాటిని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. మాకు చంద్రబాబు చెప్తున్నట్టు 5కాదు 10శాతం కావలి, అందుకే ఢిల్లీకి పంపించిన బిల్ వెనక్కు తీసుకురండి అని, దాదాపు కేంద్రానికి బిల్ పంపించిన సంవత్సరం తరువాత కోరుతున్నాడు ముద్రగడ. విశాఖలో ఆదివారం నిర్వహించిన కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయమై ఇప్పటికే తాను సీఎం చంద్రబాబుకు లేఖ రాసానని, ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా తన లేఖకు పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం సానుకూలంగా స్పందించని పక్షంలో కాపు సత్తా చాటేందుకు ఒక్క గర్జన చాలంటూ హెచ్చరించారు.

mudragada 10092018 3

అంటే ముద్రగడకు కాపులకు రిజర్వేషన్లు వస్తే, తన ఉనికి ఇంకా ఉండదు అని తెలుసు. అందుకే చంద్రబాబు 5 శాతం అంటే, ఈయన 10 అంటాడు. చంద్రబాబు 10 అంటే ఈయన 20 అంటాడు. ఈ 5 శాతం కూడా, ఎంతో క్లిష్టంగా వర్తింప చెయ్యాల్సిన పరిస్థితి. సుప్రీం కోర్ట్ దీనికి ఓకే చెప్పాలి అంటే, మన వాదన ఎంతో బలంగా ఉండాలి, అందుకే చంద్రబాబు కమిటి వేసి రిపోర్ట్ తెప్పించారు. అలాంటిది 10 శాతం కాపులకే మాత్రమే రిజర్వేషన్ అంటే అది జరిగే పనేనా ? ముద్రగడకు ఈ విషయం తెలిసినా, కేవలం రాజకీయం కోసం, ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో, రాష్ట్రంలో అలజడి రేపటానికి, కుట్రలు చేస్తున్నాడు. కాపు సోదరులు, విజ్ఞతతో ఆలోచించి, వీళ్ళ కుట్రల్లో పడకుండా, రాష్ట్ర శ్రేయస్సు కోసం అలోచించి, ఇప్పటికే పమించిన 5 శాతం రిజర్వేషన్ల కోసం, కేంద్రంతో పోరాడాలి.

mudragada 10092018 4

ముద్రగడ, ఇప్పుడు ఇలాటి పిచ్చి కోరికతో ముందుకు రావటానికి కారణం, తన జాతి కోసం కాదు, జగన్ కోసం, తన మనుగడ కోసం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముద్రగడ కోరిక చుసిన తరువాత, చంద్రబాబు కనుక కాపులకు రిజర్వేషన్ ఇస్తే, ఇక తన పని అయిపోయినట్టే అని, తనని నమ్ముకున్న జగన్ నట్టేట మునుగుతాడని, అందుకే ముద్రగడ ఈ కొత్త డ్రామాకు తెర లేపారని, ఈయన నిజంగా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడా లేక వాటిని అడ్డుకోవడం ద్వారా ఎవరికో మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాడా అని కాపులలో కూడా ఆందోళన మొదలైంది... తన రాజకీయ పబ్బం కోసం, మమ్మల్ని బలి చేసే ప్రయత్నం ఎదో జరుగుతుంది అని కాపులు గ్రహిస్తున్నారు... ఇలాంటి జటిలమైన సమస్య పరిష్కార దశలో ఉన్న సమయంలో, ముద్రగడ ఇలా చెయ్యటంతో, ఆయన నైజం బయట పడింది అని, జాతి కోసం కాకుండా, జగన్ కోసమే ముద్రగడ పని చేస్తున్నారని అంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read