ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రుణమాఫీ ప్రక్రియ ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. విభజన వలన ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో సమర్థవంతంగా, అవినీతి లేకుండా, అర్హులకి మాత్రమే రుణమాఫీ జరిగిన తీరు మాకు ఆదర్శం అంటుంది కర్ణాటక. రైతు రుణమాఫీ పథకంపై అధ్యయనం చేయడానికి కర్ణాటక నుంచి రాష్ట్రానికి ఇద్దరు అధికారుల బృందం రానుంది. ఈనెల 11, 12 తేదీల్లో ఇక్కడి అధికారులతో వారు సమావేశమవుతారు. క్షేత్రస్థాయి పర్యటనలూ చేస్తారు. 16 అంశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఇదివరకే ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ నుంచి అధికార బృందం, మన రాష్ట్రానికి వచ్చి రుణమాఫీ ప్రక్రియను స్టడీ చేసి వెళ్లారు.
దీనిని బట్టే అర్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రుణమాఫీ ప్రక్రియ ఇతర రాష్ట్రాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో. స్వయానా మహారాష్ట్ర ఆర్ధిక మంత్రి సుదీర్ ముంగన్తివార్, ఆంధ్రప్రదేశ్ రుణమాఫీ ప్రక్రియ చాలా బాగుంది అని, అక్కడ జరిగిన రుణమాఫీ ప్రక్రియ స్టడీ చేసి, మహారాష్ట్రలో ఇంప్లెమెంట్ చేస్తామని చెప్పారు. తాజాగా ఇప్పుడు కర్ణాటక బృందం రుణమాఫీకి బడ్జెట్ పరిధిలో నిధులు సమకూర్చిన విధానం, పథకం అమలుకు రైతు సాధికార సంస్థ ఏర్పాటు, అది చేపట్టిన చర్యలపై సమాచారం కోసం మన రాష్ట్రానికి రానుంది.
ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది, ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసిందనే అంశంపై రాష్ట్ర అధికారులతో ఈ కర్ణాటక బృందం చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాంతంలో పర్యటించి, కొన్ని బ్యాంకులను సందర్శించి క్షేత్రస్థాయిలో రుణమాఫీ అమలు తీరును పరిశీలిస్తారు. నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్ రుణ మాఫీ సరికాదని సలహా ఇచినా, కేంద్రం తనకు సంబంధం లేదని తేల్చిచెప్పినా, 54లక్షల బ్యాంకు ఖాతాలకు రూ.24వేల కోట్ల మేర రుణమాఫీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి, దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది. ప్రతిపక్ష నేత జగన్ రైతు రుణమాఫీ సాధ్యం కాదని హేళన చేసినప్పటికీ, చంద్రబాబు తన పరిపాలన ప్రతిభతో చేసి చూపించింది.