సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో చంద్రబాబు ఎంత గట్టిగా ఉన్నారు అనేదానికి ఇదే ఒక ఉదాహరణ.. ఒక సాగు నీటి ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలి అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. తన టీం మీద నమ్మకంతో, ఏ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో ముందే ప్రకటించారు చంద్రబాబు. గత పాలకులు ధనయజ్ఞం చేస్తే, చంద్రబాబు జల యజ్ఞం చేస్తున్నారు. ‘ఇన్ని రోజుల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తాం’ అని చెప్పడం కాదు... నిర్దిష్టంగా ఫలానా తేదీన ఫలానా ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ నెలలోనే 12 ప్రాజెక్టులను ప్రారంభిస్తామంటూ తేదీలు కూడా ప్రకటించారు. సోమవారం ఆయన సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు.
రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు చేపట్టగా... పదింటిని ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఈ నెలలోనే మరో 12 ప్రారంభిస్తామని, డిసెంబరు నాటికి మరో 11 ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తామని తెలిపారు. జలసిరికి హారతి కార్యక్రమాన్ని ఈ నెల 17, 18, 19తేదీల్లో నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే ప్రారంభించినవి: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, శారదా నదిపై ఆనకట్ట, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం, గండికోట-సీబీఆర్ ఎత్తిపోతల పథకాలు, బుడ్డా వెంగళరెడ్డి సిద్దాపురం ఎత్తిపోతల పథకం, ఎర్రకాలువ ఆధునికీకరణ, పోగొండ రిజర్వాయర్, ఎస్‌హెచ్ 31 రోడ్‌వర్క్-జీఎన్‌ఎ్‌సఎ్‌స మొదటిదశ, పులకుర్తి ఎత్తిపోతలు.
ఈనెలలో ప్రారంభించే 12: పెదపాలెం ఎత్తిపోతలు (19వ తేదీ), చినసాన ఎత్తిపోతల పథకం (18వ తేదీ), అవుకు టన్నెల్, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పులికనుమ ఎత్తిపోతల పథకాలు (ఈనెల 13న), కొండవీటి ప్రాజెక్టు (10వ తేదీ), కె.ఎల్.రావు పులిచింతల ప్రాజెక్టు (30వ తేదీ), అడవిపల్లి రిజర్వాయర్, కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్(15వ తేదీ), మారాల, చెర్లోపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్‌పై మడకశిర బ్రాంచ్ కెనాల్ (ఈనెల 30న). ఈ ఏడాదిలోపు ప్రారంభించే 11: గుండ్లకమ్మ, నెల్లూరు బ్యారేజీ (అక్టోబరు 15న), కుప్పం బ్రాంచ్ కెనాల్ (అక్టోబరు 2న), సంగం బ్యారేజీ (నవంబరు 30). ఈ ఏడాది డిసెంబరు 31న మల్లె మడుగు, బాలాజీ రిజర్వాయరు, వేణుగోపాల సాగర్, సోమశిల స్వర్ణముఖి రిజర్వాయర్, ఎర్రం చిన్నపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతలు, వంశధార స్టేజి-2 ఫేజ్ 2, వంశధార-నాగావళి అనుసంధానం, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయరు.