ఈ మాజీ అధికారులు అంతా, ఏంటో అర్ధం కాకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మాజీ డిజిపి సాంబ‌శివ‌రావు ఏదో వ్యూహంతోనే ముందుకెళుతున్న‌ట్లు, ఆయన కదలికలు చూస్తే అర్ధమవుతుంది. ఎందుకంటే, గత నెలలో అటు వైసిపీ అధినేత జగన్ తో, రెండు రోజుల తరువాత వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావటం, అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే మీడియాతో మాత్రం, జగన్ తో కర్టసీతో కలిసాను అని చెప్పారు సాంబశివరావు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హోదాలో కలిసినట్టు చెప్పారు. అయితే, తాజాగా మరో ప్రముఖ వ్యక్తితో భేటీ అయ్యారు.

dgp 04092018 2

ఈ రోజు, మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుతో, మాజీ డిజిపి భేటీతో అంద‌రిలోనూ మరోసరి చర్చ మొదలైంది. భేటీ మామూలే అని చెబుతున్నా ఎవ‌రూ న‌మ్మ‌టం లేదు. ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత మాజీ డిజిపిని గంగ‌వ‌రం పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చంద్ర‌బాబు నియ‌మించారు. ఈ విషయంలోనే కలిసినట్టు చెప్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ డీజీపీ సాంబశివరావు మంచి స్నేహితులు. నిన్న రాత్రి నేరుగా గంటా నివాసానికి వెళ్లిన ఆయన, పలు విషయాలపై చర్చించినట్టు సమాచారం. వ్యక్తిగతంగా గంటాతో సాంబశివరావుకు మంచి సాన్నిహిత్యం ఉంది.

dgp 04092018 3

ఈమ‌ధ్య హ‌టాత్తుగా విశాఖ‌ప‌ట్నం జిల్లాలో పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ను సాంబ‌శివ‌రావు క‌ల‌వ‌టం సంచ‌ల‌నమైంది. రానున్న ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంఎల్ఏ లేదా ఎంపిగా వైసిపి త‌ర‌పున పోటీ చేయ‌బోతున్నారంటూ ఒక‌టే ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్రచారాన్ని సాంబశివరావు ఖండించారు. వెంట‌నే చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. జ‌గ‌న్ తో ఏం మాట్లాడారో తెలీదు, చంద్ర‌బాబుతో ఏం మాట్లాడింది తెలియ‌లేదు. తాజాగా గంటాతో భేటీ అవ‌టం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకిత్తిస్తోంది. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావటంతో, రాజకీయంగా ఏమన్నా చర్చలు జరిగాయా అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read