ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం చింతల పూడి మండలం, బోయగూడెం గ్రామంలో గ్రామదర్శిని – గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్య టిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనం తరం గ్రామదర్శిని సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అధికారుల పనితీరు తెలుసుకొంటు న్నామన్నారు. పరిపాలనలో మార్పులు, చేర్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తృప్తికరమైన జీవితం గడిపే పరిస్థితులు తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు 15 లక్షల మందికి ఫోన్ చేసి ప్రభుత్వం పని తీరు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలో 2వేల మంది పనిచేస్తున్నారన్నారు. నా కార్యాలయంలో 100 మంది పనిచేస్తున్నారన్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు, #హోంగార్డులకు, విఆర్‌ఏ, ఆశా కార్యకర్త లకు వేతనాలు పెంచామన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు పిీఆర్‌సీ ఇచ్చామని, మరో కొత్త పిీఆర్‌సీ వేశామని తెలిపారు. ఇలా అందరికీ న్యాయం చేస్తున్నామన్నారు. అందరూ సుఖ సంతో షాలతో ఉండాలని, పేద ప్రజలకు అభివృద్దికి అండగా నిలబడాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి సంపాదన సృష్టించుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంతంగా, సమర్థ వంతంగా పనిచేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన మెరుగైన సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు రేషన్ అందించే సేవలు సక్ర మంగా చేయకపోతే అటువంటి డీలర్లను తొలగిస్తామని తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చింతలపూడిలో వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. చింతలపూడి మండలంలో డ్రైనేజి, రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయని, 4,5 నెలల్లో నాణ్యత ప్రమాణాలతో కూడి నిర్మాణపనులు పూర్తి చేస్తామని తెలిపారు.
చింతలపూడి నియోజవర్గానికి 1000, దెందులూరు నియోజకవర్గానికి 1000 పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తన అభిమతమన్నారు. పిింఛ న్ల పంపిణీ విధానంలో ప్రజలు సంతృప్తి 79శాతం ఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలో 77 శాతం, చింతలపూడి నియోజకవర్గం 74శాతం ఉండగా, బోయగూడెం గ్రామంలో 80 శాతం ఉందని, ఇందుకు అందరి అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. వారానికి 2సార్లు క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ఉన్నత అధికారులు పర్యటించేవిధంగా అధికారులను ఆదేశించామని, ఈ నేపథ్యంలో వారు గ్రామంలో ఉండి వాస్తవాలు తెలుసుకొని పథకాల అమలులో లోటు పాట్లు ఉంటే సవరించుకోవాలన్నారు.