రాష్ట్రంలో కొన్ని చోట్ల అదుపులేకుండా ప్రబలుతున్న అంటువ్యాధులు మలేరియా, డెంగీ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించారు. "చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండడం లేదు. గతంలో వ్యాధులు వచ్చిన చోట మళ్లి వ్యాధులు ప్రబలుతున్నాయంటే మీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరు ఇలాగె వ్యవహరిస్తే ఎలా.. సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టలేను.. " అని ముఖ్యమంత్రి ఈ రోజు ఉండవల్లి ప్రజావేదిక లో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసారు. సాంకేతిక పరిజ్ఞానం ఉంది.. కావలసిన సౌకర్యాలు సమకూర్చాము. హాట్ స్పాట్ లు ఏమిటో తెలుసు, డ్రోన్ లను విస్తృతంగా వినియోగించి ఎక్కడ వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఉందొ తెలుసుకొని వెంటనే తగు చర్యలు చేపట్టవచ్చు... కానీ ఆలా జరగడం లేదు"అని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు.

ప్రజలు మంచాన పడడానికి మూల కారణాలు గుర్తించండి. సోమవారానికల్లా పూర్తి వివరాలు సమర్పించండి. అప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రాక పోతే నేనే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాను.. చర్యలు తప్పవు... అని గట్టిగ ముఖ్యమంత్రి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు హెచ్చరించారు. మలేరియా కేసులు గత ఏడాది తో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ డెంగీ మాత్రం అత్యధిక కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. ఎక్కడ పరిస్థితి బాగాలేదో అక్కడ ఇంటింటికి వెళ్తున్నామని అధికారులు చెప్పారు. అలా జరిగితే పరిస్థితి అదుపులో ఉండేదని.. ఇంకా నియంత్రణ చర్యలు చాల చోట్ల సమర్థవంతంగా లేవని ముఖ్యమంత్రి అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ కూడా అప్రమత్తంగా ఉండీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ తగు చర్యాలకు ఉపక్రమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పారిశుధ్యం, పరిశుభ్రత, నీటి నిల్వ వంటి కారణాలతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఇంకా చర్యలు పెద్ద స్థాయిలో చేపడితే కానీ పరిస్థితి అదుపులోకి రాదనీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ఏడాది తో పోలిస్తే డెంగీ కేసులు 17 శాతం తగ్గినప్పటికే విశాఖపట్నం లో మాత్రం 424 శాతం డెంగీ కేసులు పెరగడమే ఆందోళన కలిగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు డెంగీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని వివరించారు. 86 శాతం కేసులు ఈ 5 జిల్లాల్లోనే నమోదయ్యాయి. పరిస్థితి వెంటనే అదుపులోకి తీసుకు రావాలని, ఇదొక అత్యవసర పరిస్థితిగా భావించి సమస్య తమదనుకుని అధికారులు విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో తిరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read