రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ చైనా పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్ర్టానిక్ దిగ్గజ కంపెనీలతో చర్చలు జరిపుతూ లోకేష్ పర్యటన కొనసాగుతుంది. అయితే, ఈ ప్రయత్నాలు ఫలించినట్టే ఉన్నాయి. లోకేష్ స్వయంగా ఒక ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎక్షైట్ అవుతారు. లోకేష్ ట్వీట్ చేస్తూ, మన రాష్ట్రంలోని తిరుపతిలో, అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ వస్తుంది, ఈ రోజే, ఈ వార్తా చెప్తాం అంటూ ట్వీట్ చేసారు. అతి పెద్ద చైనా మల్టీ నేషనల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తిరుపతి వస్తుంది, ఈ రోజే ఆ పేరు చెప్తాం అంటూ ట్వీట్ చేసారు. దీంతో, ఆ కంపెనీ ఏంటా అనే ఆసక్తి నెలకొంది.
చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు అంగీకారం తెలిపాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని రాష్ట్రానికి ఆహ్వానించడమే లక్ష్యంగా ఆయన రెండో రోజు పర్యటన సాగింది. బీజింగ్‌లో ప్రఖ్యాత కంపెనీల యజమానులు, సీఈవోలతో లోకేశ్ భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ కల్పిస్తున్న సౌకర్యాలను వివరించి వారిని మెప్పించి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా షామీ సప్లయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో లోకేశ్ పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అనువైన పరిస్థితుల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు.
మరోవైపు రాష్ట్రంలో 15వేల మంది ఒకేచోట పనిచేసేలా ఫాక్స్‌కాన్ కంపెనీని తీసుకురాగా.. తిరుపతిలో రానున్న రిలయన్స్ సెజ్‌లో దాదాపు 35 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇప్పుడు అంతకుమించి ఒకేచోట లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే మెగా ఫ్యాక్టరీ దిశగా పెట్టుబడులు తేవాలన్నది తన లక్ష్యంగా లోకేశ్ ఇటీవల ప్రకటించారు. చైనాలోని షెంజెన్ నగరం ఇలాంటి మెగా ప్రాజెక్టులకు ప్రసిద్ధి. ఆ నగరంలో కూడా రెండురోజుల పాటు లోకేశ్ పర్యటించనున్నారు. లోకేశ్‌తో పాటు ఈడీబీ సీఈవో కృష్ణకిషోర్, ఐటీ కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు చైనా వెళ్లారు.