దేశంలో బీజేపీ నేతలకు కన్ను మిన్ను కాన రావటం లేదు. ఎవరి మీద పడితే వారి మీద తమ అహంకారం చూపిస్తున్నారు. చివరకు 1 శాతం ఓటింగ్ కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో కూడా రెచ్చిపోతున్నారు. అదేమంటే, కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం అనే అహం. మొన్నటి వరకు కన్నా పర్యటనల్లో, ఎవరన్నా సామాన్యులు కేంద్ర వివిక్ష పై ప్రశ్నిస్తే, వారిని చావ బాదటం చూసాం. ఇప్పుడు ఏకంగా విలేకరులనే కొట్టేసారు బీజేపీ నాయకులు. బుధవారం కాకినాడ సూర్యకళామందిరంలో రైతు సదస్సు పేరిట సభ నిర్వహించారు. ఈ సందర్భంగా, అక్కడకి వచ్చిన విలేకరుల పై తమ ప్రతాపం చూపించారు బీజేపీ నేతలు.
రైతు సదస్సులో పలు వక్తలు మాట్లాడుతున్న సందర్భంలో మీడియా కవరేజ్‌కు వెళ్లిన కొంతమంది విలేఖరులు కూర్చోవడానికి కుర్చీలు కావాలని కార్యకర్తలను కోరారు. దీంతో కొందరు సీనియస్‌గా సమావేశం జరుగుతుందని మధ్యలో మీ గొడవ ఏంటని, ఉంటే ఉండండి లేకపోతే పోండని అనడంతో వెనుదిరిగేందుకు ప్రయత్నించే సమయంలో కార్యకర్తలు ఒక విలేఖరి పై చేయి చేసుకున్నారు. సహచర విలేఖరులకు విషయం తెలిసి కొద్దిసేపు ఆందోళన చేశారు. విలేఖరి పై చేయి చేసుకున్న కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాదు బీజేపీ నాయకులు విలేకరుల పై చూపించిన ప్రతాపానికి నిరసనగా, బీజేపీ కార్యకరమాలు అన్నీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అక్కడే ఉన్న పార్టీ పేదలకు తెలియటంతో, వారు అలెర్ట్ అయ్యి చర్చలు జరిపారు. ఇంత మంది పెద్దలు, సాక్షాత్తు కన్నా లక్ష్మీ నారయణే ఇక్కడ ఉన్నా, మా పై దాడి చేసారని, ఇంత చేస్తున్నా, ఈ నాయకులు ఏమి అనకుండా కూర్చున్నారని, ఇదంతా మీ డైరెక్షన్ లోనే జరిగిందా అంటూ ప్రశ్నించారు. అయితే, విషయం మరీ పెద్దది అవ్వటంతో, కన్నా లక్ష్మీనారయణ రంగంలోకి దిగారు. దాడి జరిగిన దానికి, కన్నా లక్ష్మీనారాయణ సభాముఖంగా జరిగిన సంఘటనకు విలేఖరులకు క్షమాపణలు చెప్పారు. దీంతో విలేకురులు ఆందోళన విరమించారు.