పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంతలా పెంచినా, అన్ని పార్టీలు ఏకమై ఆందోళన చేస్తున్నా విపక్ష వైసీపీ మాత్రం నోరెత్తడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పెట్రో ధరలపై అసెంబ్లీలో తీర్మానంపై ప్రసంగిస్తూ బీజేపీ, వైసీపీలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టారు. ‘‘ప్రతి శుక్రవారం న్యాయస్థానానికి వెళ్లడమే విపక్ష నేతకు తెలుసు. కేసుల మాఫీయే ఏకైక అజెండాగా బీజేపీ దర్శకత్వంలో పని చేస్తున్నారు. వైసీపీ రిమోట్‌ బీజేపీ చేతుల్లో ఉంది’’ అని తెలిపారు. దీనిపై విష్ణు స్పందిస్తూ... బీజేపీ, వైసీపీలు వేరువేరని, తమ మధ్య లాలూచీ ఏమీలేదని తెలిపారు. కానీ.. బీజేపీ, వైసీపీలిద్దరిదీ మోదీ ముసుగే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

kumar 11092018 2

గత కొంతకాలం నుంచి విపక్ష నేతపై ఉన్న అవినీతి కేసులన్నీ నీరుకారుస్తున్నారు. సీబీఐ, ఇతర సంస్థలను ప్రభావితం చేస్తున్నారు. 2014ఎన్నికలకు ముందు మోదీ ఏం చెప్పారో గుర్తుంచుకోండి. అవినీతిపరుల ఆటకట్టిస్తానని, కేసులను త్వరగా తేల్చేసి అక్రమాస్తులను జప్తు చేస్తామని చెప్పారు. కానీ... ఈ నాలుగేళ్ల కాలంలో ఇక్కడ విపక్షనేతపై కేసులు నీరుకారిపోయాయి’’ అని తెలిపారు. దీనిని నిరూపిస్తామని, రాజీనామాకు సిద్ధమా అని విష్ణుకు సవాల్‌ విసిరారు. అక్రమార్కులకు మద్దతుగా సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను ప్రభావితం చేయడం దుర్మార్గమన్నారు. ‘‘ముసుగు వీరుల ఆటలు ఏపీలో సాగవు’’ అని ఉద్ఘాటించారు.

 

kumar 11092018 3

జగన్ కేసులను కేంద్రం బలహీనపరుస్తుందని, ఇందుకు సాక్ష్యాలు చూపితే రాజీనామా చేస్తారా? అంటూ విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. మోదీ చేసే రాజకీయం ఇదేనా? అంటూ సీఎం మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపల అవినీతిపరులను బోనెక్కిస్తానని, నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానని చెప్పారని అ డబ్బును ప్రజల అకౌంట్లలో వేస్తానని మోదీ చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. అలాగే అన్ని కేసులను ఏడాదిలోపల క్లియిర్ చేయిస్తానని చెప్పిన మోదీ తప్పుడు కేసులు వేరేవాళ్లపై పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read