ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23న అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు . ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వివిధ పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటన ఈ నెల 26 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఏపి లో పెట్టుబడులు వచ్చే దిశగా చంద్రబాబు పర్యటన ఉండబోతుంది. ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాల గురించి వారికి వివరిస్తారు. 4 రోజుల పర్యటన అనంతరం సెప్టెంబర్ 27 న రాష్ట్రానికి చంద్రబాబు రానున్నారు.
‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు వచ్చే నెల 24న యూఎన్ఓ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. న్యూయార్క్‌లో జరగనున్న ఈ సదస్సులో సీఎం కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. కాగా, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది.
024లోపు 60 లక్షల మంది రైతులను సేంద్రీయ సాగు బాట పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి యూఎన్ఓ సాయం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్నవారికి చంద్రబాబు తన గళం వినిపించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతి సిద్ధంగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలనుకున్నారు. సుభాష్ పాలేకర్ సూచనలతో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. రైతు సాధికార సమితిల సాయంతో రైతులను సేంద్రీయ సాగు వైపు మళ్లించారు. తక్కువ కాలంలోనే ఏపీలోని రైతులు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపారు. ఏపీ రైతులను ప్రకృతి సిద్ధమైన సాగు వైపు నడిపించిన చంద్రబాబు కృషిని సర్వత్రా కొనియాడుతున్నారు.