తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టంచేశారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తొలుత పెదపాడులో దివంగత సీఎం దామోదరం సంజీవయ్య చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బైరెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాహుల్‌ మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై సూటిగా సమాధానం చెప్పారు.

rahul 18092018

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ఆనాటి ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి రాగానే మొదటగా ప్రత్యేక హోదా హామీని నెరవేరుస్తామని స్పష్టంచేశారు. హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని ఇప్పటి ప్రధాని మోదీ పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలో స్వయం సహాయక సంఘాల పనితీరును ప్రశంసించారు. దేశంలోనే మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. చైనాలో రోజుకు 50వేల ఉద్యోగాలు కల్పిస్తుంటే.. మన దేశంలో 450 మాత్రమే కల్పిస్తున్నారని మండిపడ్డారు.

rahul 18092018

తరువాత బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలన్నింటినీ ప్రధాని మోదీ తుంగలో తొక్కారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శిచారు. 2014 ఎన్నికలప్పుడు మోదీ ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మోదీలా తప్పుడు హామీలు ఇవ్వడం తనకు అలవాటు లేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. తొలి సంతకాన్ని ప్రత్యేక హోదా ఫైల్ పైనే చేస్తామని చెప్పారు. ప్రధానిగా కాకుండా దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన మోదీ... మాట తప్పారని విమర్శించారు. కర్నూలులో జరిగిన భారీ బహిరంగసభలో రాహుల్ ప్రసంగిస్తూ ఈమేరకు విమర్శలు గుప్పించారు. ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా మోదీ ఏపీని పూర్తిగా మోసం చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రుల కళ్లలోకి చూసే ధైర్యం కూడా మోదీకి లేదని ఎద్దేవా చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read