తాను ఎప్పుడూ సచివాలయంలోనే ఉంటానని, అమరావతి బాండ్ల జారీపై వచ్చిన ఆరోపణలపై గురువారం కూడా తాను చర్చకు సిద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీ కుటుంబరావు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సవాల్ విసిరారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బాండ్ల జారీలో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపించినా రాజీనామాకు తాను సిద్ధమన్నారు. ఉండవల్లికి ఏ వివరాలు కావాలన్నా ఇస్తామని, ఆ తరువాత చర్చకు రావొచ్చన్నారు. ఆయన చేసిన ఆరోపణలకు పదేపదే వివరణ ఇస్తున్నప్పటికీ, మళ్లీమళ్లీ ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. తామిచ్చిన వడ్డీ కంటే తక్కువ వడ్డీ ఇస్తే ఆయనకు డబుల్ అరెంజర్ ఫీజు చెల్లిస్తామన్నారు.

undvalli 14092018 2

ఆయా సంస్థలకు ఇచ్చే క్రెడిట్ రేటింగ్ ఆధారంగా వడ్డీని నిర్ణయిస్తారన్నారు. భారత్ రేటింగ్ ట్రిపుల్ బీ వద్ద ఉందని, డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పడిపోయిందని, దీంతో ఎప్పుడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వ బాండ్ల వడ్డీ కూడా పెరిగిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ బాండ్ల వడ్డీ 7.35 శాతం ఉండగా, అదిప్పుడు 8.18కి పెరిగిందన్నారు. సీఆర్‌డీఏ రేటింగ్ ఏ ప్లస్ ఉందని, అందుకే ఆ వడ్డీ నిర్ణయించారన్నారు. గుజరాత్‌లో గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ 1.75 శాతం అరెంజర్ ఫీజుగా చెల్లించిందని గుర్తుచేశారు. పోలవరం పనులు చేయకుండానే బిల్లులు చెల్లించామనడం సరికాదన్నారు. పోలవరం అథారిటీ తప్పుచేసిందా? అని ప్రశ్నించారు.

undvalli 14092018 3

ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగేలా ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతిపరుడు కాదని తానెప్పుడూ అనలేదని ఉండవల్లి చెప్పారని, దీంతో వైఎస్ అనినీతిపరుడేనని ఆయన అంగీకరించారన్నారు. వైఎస్‌పై వచ్చిన రాజా ఆఫ్ కరెప్షన్ పుస్తకంపై చర్చకు తానెప్పుడైనా సిద్ధమని చెప్పారు. ముంబైలో పెద్ద పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం సమావేశమయ్యారని గుర్తుచేశారు. కేవలం లిస్టింగ్ కార్యక్రమానికే ముంబై వెళ్లలేదన్నారు. పోలవరం, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన వివరాలన్నీ ఉండవల్లి ఇచ్చేందుకు కూడా సిద్ధమేనని కుటుంబరావు స్పష్టం చేశారు. కావాలంటే పెట్టుబడుల కాపీలను కూడా పంపుతానని చెప్పారు. నెలరోజులైనా సరే వాటిని అధ్యయనం చేసి రావాలని ఉండవల్లికి సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read