పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే గ్యాలరీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబసభ్యులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా గ్యాలరీ వాక్ చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణం స్పిల్ వే గ్యాలరీ. దీని నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పోలవరం గ్యాలరీ విషయానికి వస్తే... దీని ఎత్తు 2 మీటర్లు, వెడల్పు రెండున్నర మీటర్లు. గ్యాలరీలో చిమ్మచీకటి ఉంటుంది. వెలుతురు కోసం ప్రత్యేకంగా లైట్లను అమర్చుకోవాలి. డ్యామ్ కింద భాగంలో ఇది ఉంటుంది. 26వ బ్లాక్ నుంచి 31వ బ్లాక్ వరకు గ్యాలరీ చాలా లోతులో ఉంటుంది.

gallery 13092018 2

కొన్ని చోట్ల 18 మీటర్ల లోతు నుంచి దీన్ని నిర్మించారు. దీంతో, ఆ ప్రాంతంలో దాదాపు 14 అంతస్తుల భవనం దిగి, మళ్లీ అంత భవనాన్ని ఎక్కే స్థాయిలో మెట్లు ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హుషారు అందరికీ తెలిసిందే. గతంలో తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లినప్పుడు... ఎక్కడా ఆగకుండా పైకి ఎక్కిన ఘనత ఆయనది. నిన్నటి గ్యాలరీ వాక్ లో కూడా ఆయన అంతే హుషారుగా నడిచారు. ఆయనతో పాటు నడవడానికి మంత్రులు, అధికారుల చాలా ఇబ్బంది పడ్డారు. ఆయనను అందుకోవడం వారికి కష్టసాధ్యంగా మారింది. పరిస్థితిని గమనించిన జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ సీఎం వద్దకు వెళ్లి, 'కాసేపు ఆగుదాం సార్' అని చెప్పారు. దీనికి సమాధానంగా, 'నడవలేక పోతున్నారా?' అంటూ చంద్రబాబు సరదాగా ప్రశ్నించారు.

gallery 13092018 3

గ్యాలరీలో ముందస్తుగానే పెద్దసంఖ్యలో ఆక్సిజన్‌ సిలెండర్లు, స్టాండింగ్‌ ఎసిలను ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీని 2మీటర్ల వెడల్పు, రెండున్నర మీటర్ల ఎత్తులో 1069.5మీటర్ల పొడవునా స్పిల్‌వే లోపల సొరంగం తరహాలో నిర్మించారు. జలాశయం నిండి అదనంగా వచ్చే వరద నీటిని గేట్ల ద్వారా నది దిగువకు విడుదల చేయడానికి స్పీల్‌వే ఉపయోగపడుతుంది. స్పిల్‌వేలో అంతర్భాగంగా ఈ గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీ వల్ల భూమి అడుగునుండి డ్యామ్‌ మీద పడుతున్న ఊర్ధ్వ పీడన ఒత్తిడి తగ్గించేందుకు అవకాశముంటుంది. గ్యాలరీ సొరంగం తరహాలో ఉండడం వల్ల లోపల ఆక్సిజన్‌ సమస్య తరచూ తలెత్తుతుంది. దీన్ని అధిగమించేందుకు వీలుగా కొన్ని గొట్టాలేర్పాటు చేశారు. గ్యాలరీలోని ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ కంట్రోల్‌ రూమ్‌ను నెలకొల్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read