అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని, ఉండవల్లి నివాసం నుంచి నార్కెట్ పల్లి బయలుదేరిన ముఖ్యమంత్రి. చంద్రబాబు కామినేని హాస్పటల్ లో హరికృష్ణ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించనున్న సీఎం చంద్రబాబు. ప్రముఖ సినీనటుడు, టిడిపి మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. ఉదయాన్నే ప్రమాద వార్త విన్నవెంటనే తీవ్ర షాక్ కు గురైన ముఖ్యమంత్రి. అప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి అందరినీ అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి. దుర్ఘటనా స్థలానికి హుటాహుటిన తరలివెళ్లాలని, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి. వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించినా కాపాడుకోలేక పోయామన్న ఆవేదనలో ముఖ్యమంత్రి.
చంద్రబాబు సంతాప సందేశం... "నందమూరి హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరనిలోటు. తెలుగుదేశం పార్టీకే కాదు, రాష్ట్రానికే తీరనిలోటు. హరికృష్ణ లేని లోటు పూడ్చలేనిది. బాలనటుడిగా,కథానాయకునిగా,కేరక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రల పోషణలో అందెవేసిన చెయ్యి. చలన చిత్ర రంగానికి,రాజకీయ రంగానికి ఎనలేని సేవలు అందించారు. ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టుడు నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ చైతన్య రథ సారధి నందమూరి హరికృష్ణ. తానే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ఎన్టీఆర్ ను రాష్ట్ర ప్రజలకు చేరువ చేశారు. నిరాడంబరుడు,నిగర్వి,స్నేహానికి మారుపేరు హరికృష్ణ. శాసన సభ్యునిగా,మంత్రిగా,రాజ్యసభ సభ్యునిగా ఎనలేని సేవలు అందించారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకే కాదు వ్యక్తిగతంగా నాకు,మా కుటుంబానికి తీరనిలోటు" అని చంద్రబాబు అన్నారు.