నిన్న ఉదయం 6 గంటలకు హరికృష్ణకు యాక్సిడెంట్ అయ్యింది అని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన వ్యక్తిగత సిబ్బంది కబురు అందించారు. ఆ సమయంలో చంద్రబాబు వ్యయాయం చేసుకుంటూ ఉన్నారు. ఈ వార్తా విన్న చంద్రబాబు ఒకింత షాక్ అయ్యి, నిజమేనా ఆయనే డ్రైవ్ చేస్తున్నారా, ఆయన ఎందుకు వాహనం నడుపుతున్నారు, ఒకసారి మళ్ళీ కనుక్కోండి అంటూ చంద్రబాబు ముందుగా రియాక్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని, వెంటనే యంత్రాంగం మొత్తాన్ని అలెర్ట్ చేసారు. వెంటనే సీఎంవో అధికారులకు కబురు పంపి, తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు, వైద్యులతో సమన్వయం చేసుకోవాలని, హరికృష్ణకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

cbn 30082018 2

అలాగే కుటుంబంలో ఉన్న అందరికీ చంద్రబాబు, హరికృష్ణ యాక్సిడెంట్ గురించి చెప్పారు. సతీమణి భువనేశ్వరితో ఫోన్లో మాట్లాడి బ్రాహ్మాణితో కలిసి హరికృష్ణ ఇంటి వద్దకు వెంటనే వెళ్లాలని అప్రమత్తం చేశారు. బాలకృష్ణకు ఫోన్‌ చేసి ఘటనా స్థలానికి బయల్దేరాలని సూచించగా, తాను రోడ్డు మార్గంలో వెళ్తున్నానని ఆయన సమాధానమిచ్చారు.. సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న తెలంగాణా తెలుగుదేశం నాయకులకు కూడా ఫోన్ చేసి, ఘటనా స్థలానికి చేరుకోవాలని అవసరం అయిన సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

cbn 30082018 3

అలాగే, కామినేని ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడి హరికృష్ణ పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని కోరారు. అవసరం అయితే హైదరాబాద్ కి మెరుగైన వైద్యం కోసం పంపించాలని ఆదేశించారు. అరగంట సేపు వరకు, డాక్టర్ లతో టచ్ లో ఉంటూనే ఉన్నారు. ఈ లోపే హరికృష్ణ పల్స్ డౌన్ అయిపోవటం, ఆయన మరణించటం జరిగిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, హరికృష్ణ దక్కకపోవటంతో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే హెలీకాఫ్టర్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. అలాగే అధికారులతో మాట్లాడి, రాష్ట్రంలో హరికృష్ణ మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం తరుపున రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించాలని ఆదేశించారు. ఇక అక్కడకు వెళ్ళిన తరువాత కూడా, అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తారక్, కళ్యాణ్ రాం, బాలయ్యకు ధైర్యం చెప్పారు. అంబులెన్సు వెంటే, హైదరాబాద్ వచ్చారు. రాత్రి పొద్దుపోయే దాక అక్కడే ఉండి, అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read