జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగానే, ఈ జనరేషన్ కు నందమూరి హరికృష్ణ తెలిసిఉండవచ్చు. కానీ, హరికృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక క్రియాశీలక కార్యకర్త. తండ్రి మాట జవదాటని ఒక మంచి కొడుకు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి, చైతన్య యాత్ర చేసిన సందర్భంలో, చైతన్య రధసారిధి. బాల నటుడి స్థాయి నుంచి ఎదిగి సినిమా రంగంలో తనదంటూ ఒక ముద్ర వేసిన రియల్ హీరో సీతయ్య. వైవీఎస్ లాంటి ఎందరికో జీవితాన్ని ఇచ్చిన దాన కర్ణుడు. హరికృష్ణ కొంత కాలం రవాణా శాఖ మంత్రిగా కూడా పని చేసారు.
రవాణా శాఖ మంత్రిగా పని చేపిన హరికృష్ణ ఆ శాఖలో కూడా ఎవరి మాట వినకుండా ఉద్యోగులు కార్మికులకు ఏది మంచి అనిపిస్తే అదే చేసే వారనే పేరు ఉంది. కొన్ని నిర్ణయాలకు అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చినా వారి మాట వినే వారు కాదనే పేరు హరికృష్ణకు ఉంది. ట్రాక్టర్ ల పై పన్ను తీసేసిన రవాణా మంత్రిగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం, ఇప్పటికీ హైలైట్. రైతులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయం తీసుకున్నది ఆయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రవాణా మంత్రిగా ఉన్న సమయంలో.
రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు ధ్వజమెత్తిన వాడు హరికృష్ణ. తెలుగు కోసం రాజ్యసభ సభ్యత్వం వదిలేసుకున్న వాడు నందమూరి హరికృష్ణ. తెలుగు బాషా దినోత్సవం రోజే ఆయన యాక్సిడెంట్ కి గురి అవ్వటం, చనిపోవటం బాధాకరం...
నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ సెప్టెంబరు 2, 1956న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. ఎన్టీఆర్ 1982లో టీడీపీ పార్టీ అవిర్భవ సమయం నుంచి నేటి వరకు పార్టీ ముఖ్యనాయకుడిగా ఉన్నారు.. ప్రస్తుతం టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యుడుగా పనిచేస్తున్నారు..