ముంబైలో పర్యటిస్తున్న చంద్రబాబు, రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి సింగపూర్ కి అంతర్జాతీయ విమాన సర్వీసులు అక్టోబర్ 2వ తేదీన ప్రారంభం కానున్నదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ముంబైలోని పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబైలో టాటా ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సందర్శించారు. టాటా గ్రూప్ సామజిక పరంగా చేపట్టిన మహిళా సాధికారత వంటి కార్యక్రమాల పై ప్రాజెక్టులను టాటా అధికారులు వివరించారు.

mumbai 27082018 2

ఆంధ్రప్రదేశ్ లో హోటల్, పర్యాటక శాఖ, ఎలక్ట్రికల్ బస్సు రవాణా వంటి రంగాల్లో భాగస్వామ్యం కావలసిందిగా ముఖ్యమంత్రి టాటా గ్రూప్ ను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో మంచి అవకాశాలున్నాయని ఆ దిశగా తాము ప్రతిపాదనలతో ముందుకు వస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డబ్ల్యూ.ఈ.ఎల్.ఎస్.పి.యూ.ఎన్ గ్రూపు చైర్మన్ బాలకృష్ణ గోయెంకా తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సేంద్రియ పత్తి సాగు లో ఆంధ్రప్రదేశ్ తో ఉమ్మడి గా పని చేయడానికి ఆయన ముఖ్యమంత్రి కి తన ఆసక్తి ని వ్యక్తం చేసారు. రైతులకు కనీస మద్దతు ధర కన్నా 33 శాతం అధిక ఆదాయం పొందేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గోయెంకా వివరించారు. దీనిపై ప్రతిపాదనలతో రావలసిందిగా ముఖ్యమంత్రి సూచించారు.

mumbai 27082018 3

"ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం.. మా మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహారణ" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగన్న ముంబై లో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఇన్నోవేషన్ కేంద్రాంనొకదానిని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి బీఎస్ఈ అధికారులను కోరారు. సృజనాత్మక విధానాలదే భవిష్యత్ అని దాని ద్వారానే అనేక కొత్త కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తూ జ్ఞాన భూమిగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రియల్ టైం గవెర్నెన్స్ రాష్ట్ర పాలన లో ఒక కీలక భూమిక పోషిస్తోందని, సమర్థ ఆర్థిక నిర్వహణ, ఈ-ఆఫిస్, కంటెంట్ కార్పొరేషన్ వంటి వినూత్న ఆవిష్కరణలు రాష్ట్ర పరిపాలనలో ఒక కొత్త ఒరవడి సృష్టించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read