రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా విజయవాడ నగరంలో ప్రయోజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే మూడు కూడళ్లను ఎంపిక చేసుకుని వినూత్న తరహాలో జనచైతన్యానికి తమవంతుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని, కారు నడిపే వారు- ముందు సీటులో కూర్చునే వారు తప్పనిసరిగా సీటుబెల్టు పెట్టుకోవాలని సూచిస్తూ మంగళవారం ఉదయం బెంజిసర్కిల్ కూడలి వద్ద యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ జాగ్రత్తల గురించి వివరించి అందరినీ ఆకట్టుకున్నారు.
నగరంలో ఉన్న ట్రాఫిక్ కూడళ్ళ వద్ద యమధర్మ రాజు, చిత్ర గుప్తుడు వేషదారణలో ఉన్న వ్యక్తులతో పాటు, 15 అడుగల ఎట్టు కలిగిన వ్యక్తులతో రోడ్ సేఫ్టీ పై అవగాహాన కలిగించారు. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు జరగనుంది. హెల్మెట్ లేని వారికి, సీట్ బెల్ట్ పెట్టుకొని వారికి గులాబీ పువ్వుతో పాటు హెల్మెట్ కీచైన్, కరపత్రం అందిస్తారు. రహదారి భద్రతపై ఎవరు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వాహనదారుల్లో సొంతంగా తమ ఆలోచనల్లో మార్పు తీసుకురావడం వల్లే సత్ఫలితాలు సాధించే వీలుంటుందని ఈ సందర్భంగా విజయవాడ ట్రాఫిక్ ఏసీపీ శివరామిరెడ్డి తెలిపారు.