‘మీరు పెట్రోల్‌ బంకుల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాల్సిందే. కేంద్ర పథకాలను ప్రచారం చేయాల్సిందే. లేదంటే మీకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా ఉండదు’ అంటూ చమురు సంస్థలు చేస్తున్న హెచ్చరికలపై పెట్రోల్‌ డీలర్ల అసోసియేషన్లు మండిపడుతున్నాయి. అధికారులు బెదిరిస్తున్నారని భారత పెట్రోల్‌ డీలర్ల కన్సార్టియం అధ్యక్షుడు ఎస్‌.ఎ్‌స.గోగి వాపోయారు. ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థలు ప్రతి డీలర్‌కు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాయని వివరించారు. అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని ఐఓసీఎల్‌ అధికారి తెలిపారు. ‘ప్రధాని ఫొటో పెట్టాలని అడగలేదు. కేవలం చమురు సంస్థలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల ప్రచార ప్రకటనలను బంకుల్లో పెట్టాలని సూచించాం. వాటిలో ప్రధాని ఫొటో ఉండడం సాధారణమే’ అని వివరించారు.

petrol 27082018 2

మరో పక్క, ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలకు, పెట్రోల్ డీలర్లకు మధ్య మరో వివాదం తలెత్తింది. తమ ఔట్ లెట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల కులం, మతం, నియోజకవర్గం వివరాలను వెంటనే సమర్పించాలని ఆయిల్ సంస్థలు ఆదేశించిడమే దీనికి కారణం. అయితే ఉద్యోగుల వివరాలు వెల్లడించడం వ్యక్తిగత గోప్యతకు భంగమని చెప్పిన డీలర్ల యూనియన్.. ఏఒక్కరి వివరాలను ఇవ్వబోమని ప్రకటించింది. పెట్రోల్ ఔట్ లెట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని జూన్ 11నే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) , పంజాబ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కు లేఖ రాశాయి. దీనిపై మండిపడ్డ డీలర్లు తమ ఉద్యోగుల వివరాలను ఇవ్వబోమని ప్రకటించారు.

petrol 27082018 3

దీంతో హరియాణాలో కొందరు డీలర్లకు పెట్రోల్, డీజిల్ సరఫరాను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిలిపివేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పెట్రోల్ డీలర్లు మండిపడుతుంటే.. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల వివరణ మాత్రం ఇంకోరకంగా ఉంది. పెట్రోల్ ఔట్ లెట్లలో పనిచేసే ఉద్యోగులకు ప్రధానమంత్రి నైపుణ్య శిక్షణ పథకం కింద ట్రైనింగ్ ఇచ్చేందుకే 24 అంశాల్లో సమాచారం కోరామని కంపెనీలు తెలిపాయి. కానీ డీలర్ల సంఘాలు మాత్రం తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించలేదని వ్యాఖ్యానించాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read