వెలగపూడి సచివాలయంలో, పెద్ద వర్షం పడి జల్లు లోపాలకి కొడితేనో, ఏసి పైప్ లైన్ బ్లాక్ అయ్యి, నీళ్ళు లోపలకి వస్తేనో, హడావిడి హడావిడి చేసేసి, సచివాలయం కూలిపోతుంది అనే బ్యాచ్ ని చూస్తున్నాం. 6 బ్లాకుల అతి పెద్ద సచివాలయంలో, ఒక రూమ్ లో చిన్న సమస్య వస్తేనే, అమరావతిని ఎగతాళి చేసే బీజేపీ నేతలు, వారు అధికారం ఉన్న రాష్ట్రంలో, ముచ్చటపడి కట్టుకున్న కొత్త ఎయిర్ పోర్ట్ లో, వర్షానికి జలపాతం వచ్చింది. అసోంలోని గువహటి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా వేసిన రూఫ్ నుంచే నీళ్లు కురుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ వర్షం పడడంతో విమానాశ్రయ రూఫ్ నుంచి నీళ్లు ఏకంగా షవర్ నుంచి వస్తున్నట్లుగా కిందకు పడుతున్నాయి. సీలింగ్‌లోని ఏసీ వెంట్స్, లైట్ సాకెట్లు, సీలింగ్ టైల్స్‌కు మధ్య ఉన్న సందుల నుంచి షవర్‌లో నుంచి నీళ్లు పడుతున్నట్లుగా నీళ్లు కిందకు కురిశాయి. దీంతో అక్కడంతా తడిసిపోయి గందరగోళంగా మారింది. సిమెంట్ స్లాబ్ నుంచి ఇంత ఎక్కువగా నీళ్లు కారుతుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
విమానాశ్రయంలోని ప్యాసింజర్ లాంజ్‌ను ఇటీవలే కొంత పొడిగించారు. బ్యాగేజీ చెకింగ్ ప్రాంతంలో రూఫ్ నుంచి కారిన నీళ్లు ఇలా సీలింగ్ నుంచి కురవడంతో ప్రయాణికులు వీడియోలు తీశారు. చాలా మంది పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో ఈ వీడియోలను పోస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరారు. ఈ వీడియో రెండ్రోజుల కిందటిదని విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షం వల్ల రూఫ్ నుంచి నీళ్లు లీకయ్యాయని, సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారని చెప్పారు. నీళ్లు లీకవ్వడం వల్ల విమానాశ్రయంలోని పరికరాలేమీ పాడవ్వలేదని తెలిపారు.