నాలుగు రోజుల క్రితం ఒక తెలుగు న్యూస్ ఛానల్ లో, పవన్ కళ్యాణ్, జనసేన భాగోతం బయట పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో కలవటానికి, ఒకే సామజిక వర్గానికి చెందిన వారిని ఒక మీటింగ్ పెట్టి, ITC కాకతీయ హోటల్ కి రప్పించారు. దీనికి ఎంట్రీ ఫీజు 10 లక్షలు. లోపాలకి వెళ్ళిన తరువాత, మన శక్తి కొద్దీ ఇంకా సమర్పించాలి. ఇలా 150 మంది దాకా హాజరయ్యారు. అంటే గంటలో 15 కోట్లు కలెక్షన్. ఇదంతా ఆ న్యూస్ ఛానల్ వీడియో తియ్యటం, ఆ న్యూస్ ఛానల్ లో మూర్తి ప్రసారం చెయ్యటం జరిగింది. అయితే, 10 నిమషాల్లోనే ఆ ప్రోగ్రాం ఆపేశారు. కొన్ని ఒత్తిడులు రావటంతో, ఈ ప్రోగ్రాం ఆపేశారు.

mahaa 14092018 1

దీంతో మనస్తాపం చెందిన మూర్తి రాజీనామా చేసి వచ్చేశారు. అయితే, పవన్ పై ఏ నెగటివ్ న్యూస్ వచ్చినా, పవన్ కు ఉండే కొంత మంది ఉన్మాద అభిమానులు, ఎలా ప్రవర్తిస్తారో అందరికీ తెలిసిందే. అదే విధంగా, మూర్తి పై కూడా దాడి ప్రారంభించారు. మూర్తి కమ్మ సామాజిక వర్గం అంటూ, తను ఆ కులం కాకపోయినా, అంటకట్టి, చంద్రబాబు డబ్బులు ఇచ్చి చేపించారు అంటూ హడావిడి చేసారు. కొంత మంది, మా పవన్ కి భయపడి, మూర్తి ఆపేసాడు, మా పవన్ గ్రేట్ అంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే, ఇవన్నీ నాలుగు రోజుల నుంచి చూస్తున్న మూర్తి, ఒక వీడియో రూపంలో తన సందేశం ఇచ్చారు.

mahaa 14092018 1

మూర్తి మాటల్లో... "నేను వెన్ను చూపి పారిపోయే వ్యక్తిని కాదు. ప్రశ్నించటం కోసమే జనసేన అన్నారు, జనసేనను ప్రశ్నించే అధికారం మాకు లేదా ? మూర్తి జర్నలిజాన్ని నమ్ముకున్నాడు, అమ్ముకోడు. కాపు ప్రముఖలతో జనసేన పెట్టింది సీక్రెట్ మీటింగే. ఆ సమావేశం దగ్గరలోనే నేనూ ఉన్నా. అక్కడే పీ టు సీ కూడా చెప్పా. సీక్రెట్ మీటింగ్ కాకపొతే మీడియాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు ? కనీసం మీ ఛానల్ 99లో న్యూస్ ఎందుకు వేసుకోలేదు ? ఆహ్వానితుల ఫోన్లు ఎందుకు లాక్కున్నారు ? పార్టీ పేరుతో కాకుండా illusion మీడియా పేరుతో మీటింగ్ ఎందుకు పెట్టారు ? పవన్ ను నేను అభిమానించా, కొత్త స్వచ్చమైన రాజకీయ శక్తి అవుతుందని ఆశించా."

mahaa 14092018 1

"కత్తి మహేష్ వివాదంలో పవన్ తో రాజీ చేశా. అప్పుడు పవన్ అభిమాలనులకు నేను దేవుడిలా కనిపించా. ఇప్పుడు మాత్రం దెయ్యం అయ్యానా ? జనసేన కులాలను కలుపుతుందని అన్నారు. కాని ఒక కులాన్ని మాత్రమే కలుపుతున్నారు. అమరావతి ఓ సామాజిక వర్గానిదే అని పుస్తకం వేసారు, మరి జనసేన చేస్తుంది ఏమిటి ? నేను కమ్మ కులం అంటున్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికార, ప్రతిపక్ష కులాల్లో నేను పుట్టలేదు. జర్నలిస్టులు ప్రభుత్వాలు అధికారికంగా ఇచ్చే ప్రయోజనాలేవీ తీసుకోలేదు. లంచగొండిని అయితే, ఈ వీడియో తీసుకుని, పవన్ దగ్గరే బేరం పెట్టె వాడిని. నా వార్తను అర్ధాంతరంగా ఆపేసారని చానెల్ కు రాజీనమా చేసాను. నేను జర్నలిజం కోసమే పుట్టా, జర్నలిజం కోసమే చస్తా.. జనసేన అన్ని పదవుల్లో కాపులే ఉన్నది నిజం కాదా ? నాకు చానెల్ లేకపోవచ్చు, నేనే ఒక ఛానల్. జనసేన సమాచారం చాలా నా దగ్గర ఉంది. నాలుగు రోజులగా పవన్ ఫాన్స్ నా పై దుష్ ప్రచారం చేస్తున్నారు. నేను వెన్ను చూపి పారిపోయే వాడిని కాదు." పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు... https://youtu.be/lDKp3aWhpwc

Advertisements

Advertisements

Latest Articles

Most Read