తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం పురించటానికి నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలో పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే అమిత్‌ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అరెస్ట్ వారంట్ వ్యవహారం పై విలేకరలు ప్రశ్నించగా, అమిత్ షా చాలా వెటకారంగా స్పందించారు. 37 సార్లు సమన్లు ఇచ్చాక కూడా కోర్టుకు వెళ్లకుంటే.. వారెంట్లు కాక ఇంకేం వస్తాయి? అంటూ వెటకారం చేసారు.

amit 15092018

నిజానికి, అసలు ఇప్పటి వరకు ఏ నోటీసు కూడా, ఎవరికీ రాలేదు మొర్రో అంటుంటే, అమిత్ షా మాత్రం, ఎంతో వెటకారంగా మాట్లాడారు. మాకు ఇలాంటి విషయాల్లో, ఏమి సంబంధం ఉండదు, మా పని వేరు, కోర్ట్ ల పని వేరు అంటూ చెప్పుకొచ్చారు. కేవలం ప్రజల నుంచి సానుభూతి పొందేందుకే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలు నమ్మేయడానికి ఆంధ్రా ప్రజలు అంత అమాయకులేమీ కాదని అమిత్ షా అన్నారు. చంద్రబాబుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయడానికీ, బీజేపీకి సంబంధం లేదని షా స్పష్టం చేశారు. అయితే, ఎప్పుడో 8 ఏళ్ళ నాటి కేసు, మొన్న ఎవరో వ్యక్తి వెళ్లి కోర్ట్ లో పిటీషన్ వెయ్యటం, దాని పై కోర్ట్ అరెస్ట్ వారంట్ ఇవ్వటం, ఇప్పటి వరకు చంద్రబాబుకి ఒక్క నోటీస్ కూడా రాకపోవటం పై, అమిత్ షా ఒక్క ముక్క చెప్పలేదు.

amit 15092018

మహారాష్ట్రలో బాబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా 2010లో చంద్రబాబు ఆందోళన చేసిన సమయంలో నమోదైన కేసులపై ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో చంద్రబాబు, ఆయన వెంట వెళ్లిన 14మంది టీడీపీ ఎమ్మెల్యేలపై ధర్మాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. దీంతో చంద్రబాబుతో పాటు మిగతా టీడీపీ నేతలకు కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబు సహా మిగతా నేతలంతా కోర్టుకు హాజరుకావాలని వారికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న వారిలో నారా చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, టి .ప్రకాష్ గౌడ్, నక్కా ఆనంద బాబు, గంగుల కమలాకర్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు, జి.రామానాయుడు, సి.హెచ్.విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్.సోంజోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read