విజయ్‌ మాల్యా లండన్ పారిపోవటానికి సహకరించింది ఎవరు? సీబీఐలోని ఉన్నతస్థాయి అధికారులు లోపాయికారీగా సహకరించారా? బీజేపీ పెద్దలే ఆయన ‘పరారీ’కి సహకరించారా? భద్రంగా దేశం వదిలి పారిపోయేందుకు వీలు కల్పించారా? ‘లుకౌట్‌ నోటీసు’లో ఎవరికీ ఇవ్వని మినహాయింపులు మాల్యాకు ఇచ్చారా? ఈ విషయాలేవీ సీబీఐ డైరెక్టర్‌ అనిల్‌సిన్హాకు తెలియకుండా జరిగాయా? ఈ అనుమానాలను బలపరిచేలా కొత్త సంగతులు బయటపడుతున్నాయి. ‘ఎన్డీటీవీ’ చేసిన తాజా పరిశోధనలో ఇవే నిజమనే తేలుతున్నాయి. దేశం నుంచి పారిపోవడానికి వీల్లేకుండా మాల్యాపై అక్టోబరు 16, 2015న సీబీఐ లుకౌట్‌నోటీసు జారీ చేసింది.

cbi 15092018 2

దీనిప్రకారం సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్తే, విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేస్తారు. అనారోగ్యం, ఇతర కారణాలతో వెళ్లాల్సి వస్తే ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇంతటి ముఖ్యమైన నోటీసును నవంబరు 24, 2015న మార్చేశారు. అందుకు సీబీఐ సంయుక్త సంచాలకుడు ఎ.కె.శర్మ అనుమతించారు. ఇది మార్చకపోయి ఉంటే పాస్‌పోర్ట్‌ సంఖ్య ఆధారంగా మాల్యాను అరెస్టు చేసి ఉండేవారు. నోటీసులో జరిగిన కీలకమార్పు గురించి తమ బాస్‌ అయిన సీబీఐ డైరెక్టర్‌కు శర్మ చెప్పలేదు (ఉద్దేశపూర్వకంగా తెలియనివ్వలేదు). ఇప్పుడే అదే శర్మ నీరవ్‌మోదీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణాలను విచారిస్తుండటం గమనార్హం.

cbi 15092018 3

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పరారీ వెనుక సీబీఐ, ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన దాడిని మరింత ఉదృతం చేశారు. విజయ్ మాల్యాపై జారీ అయిన లుక్‌అవుట్ నోటీసును సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ బలహీనపర్చారని ఆరోపించారు. గుజరాత్ కేడర్ అధికారి అయిన శర్మ... సీబీఐలో ప్రధాని మోదీ ‘‘కనుసన్నల్లో’’ నడుచుకుంటున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. దేశం విడిచి పరారైన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తప్పించుకునేందుకు కూడా శర్మయే కారణమని ఆరోపించారు. మరో పక్క విజయ్ మాల్య రెండు రోజుల క్రిందట, నేను లండన్ వెళ్ళే ముందు అరుణ్ జైట్లీని కలిసాను అని చెప్పిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read