ఎనిమిదేళ్ల క్రితం జరిగిన బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసు ఆకస్మికంగా, అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ కోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 16 మందిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 21న హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో విచిత్రంఏమిటంటే బాబ్లీ ఆందోళన సమయంలో తమ పై నమోదైన కేసు ఎప్పుడో క్లోజ్ అయ్యిందని, ఆ తరువాత మహారాష్ట్ర పోలీసులు మరో కేసు పెట్టినట్లు తమకు తెలియనే తెలియదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే అసలు ఇప్పటివరకు తమకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులూ అందలేదని తెలిపారు.

cbn 15092018

ఇంకా చెప్పాలంటే... ‘చంద్రబాబుపై అరెస్టు వారెంటు’ అంటూ గురువారం మహారాష్ట్రలోని స్థానిక పత్రికలో వార్త వచ్చేదాకా ఈ విషయం బయటి ప్రపంచానికి కూడా తెలియదని చెపుతున్నారు. అయితే ఈ కేసులో సంచలన విషయమేమిటంటే ఈ కేసు బెయిలబుల్‌ కేసు. 2010 జూలై 17వ తేదీన కేసు నమోదైంది. జూలై 19వ తేదీన ధర్మాబాద్‌ సివిల్‌ జడ్జి జూనియర్‌ డివిజన్‌ కోర్టులో విచారణ జరిగింది.అదేనెల 26వ తేదీన ఈ కేసును కొట్టివేస్తూ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వేరే కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అడ్రస్ లభ్యం కానప్పుడు, ప్రాసిక్యూషన్‌ అంత పట్టింపుతో లేదనుకున్నప్పుడు మాత్రమే ఇతర కారణాలతో కేసును డిస్పోజ్‌ చేస్తారు. అంటే... చంద్రబాబుతోపాటు 65 మందిపై బాబ్లీ ఆందోళన కేసు మొదలైన పది రోజుల్లోనే క్లోజ్‌ అయ్యింది. ఈ విషయం కోర్టుల అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంది. ఈ కేసు నెంబర్‌తో ఎవరైనా శోధిస్తే... ‘డిస్పోజ్డ్‌’ అనే కనిపిస్తుంది. దీంతో ఈ కేసు గురించి టీడీపీ నేతలు కూడా మరిచిపోయారు

cbn 15092018

అయితే అదే టైంలో కేసు డిస్పోజ్ చేసి, మరో కేసు పెట్టారు. రెండో కేసులో, మొదటి కేసులో ఉన్న 64 మంది కాకుండా, చంద్రబాబుతో పాటు మరో 15 మంది ముఖ్య నేతలను మాత్రమే నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఐపీసీలోని సెక్షన్‌ 353, 324, 332, 336, 337, 323, 504, 506, 109, 34 ప్రయోగించారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న వారి పై దాడికి పాల్పడటం, వారి విధులను అడ్డుకోవడం, మారణాయుధాలతో దాడికి ప్రయత్నించడం, ఇలా తీవ్ర నేరారోపణలు చేశారు. చంద్రబాబు పై ఇలాంటి కేసు పెట్టటం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. ఒకే సంఘటనకు సంబంధించి పలు పరిణామాలు జరిగినప్పుడు మొదటి కోర్టు అనుమతితో కేసులో కొత్త వివరాలు, సెక్షన్లు చేర్చవచ్చు. కానీ... ధర్మాబాద్‌ పోలీసులు అలా చేయలేదు. కొత్తగా మరో కేసు పెట్టారు. అయితే, ఆ సమాచారాన్ని నిందితులుగా పేర్కొన్న వారికి తెలియపరచలేదు.

cbn 15092018

ఈ కేసు విషయమై 2013 జూలై 1న ధర్మాబాద్‌ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 2013 ఆగస్టు 31న మొదటి విచారణ జరిగింది. విచారణకు ముందు కేసులోని నిందితులకు సమాచారం ఇవ్వడం, ఎఫ్‌ఐఆర్‌తో పాటు చార్జిషీటు ప్రతులను అందరు నిందితులకు అందించడం తప్పనిసరి. కానీ,చంద్రబాబు సహా ఎవ్వరికీ సమాచారం అందలేదు. ఈ కేసు 2013 నుంచి ఇప్పటిదాకా ధర్మాబాద్‌ కోర్టులో 52 వాయిదాలు పడింది. విచిత్రమేమిటంటే, ఇన్ని వాయిదాలలో మహారాష్ట్ర పోలీసులు ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ కేసు సంగతి, విచారణ గురించి చంద్రబాబుకి కాని, ఆ 15 మందికి కాని తెలుపలేదు. చివరికి, మొన్న బయటకు వచ్చిన విషయం, చంద్రబాబు, మరో 15 మందిని అరెస్టు చేసి ఆగస్టు 16న తన ముందు హాజరుపరచాలని జడ్జి జూలై 5న ఉత్తర్వులు ఇచ్చారు. మళ్ళీ హాజరు తేదీని సెప్టెంబర్ 21కి మార్చారు. ఈ ఉత్తర్వు కూడా మీడియాలో వచ్చింది కాని, ఇంకా ఇంతవరకూ చంద్రబాబుకి కాని, ఆ 15 మందికి కాని అందలేదు.

cbn 15092018

గురువారం మహారాష్ట్ర స్థానిక పత్రికలో వార్త వచ్చిన తర్వాతే ఈ సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఏకంగా అరెస్టు వారెంటు జారీ కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఒకో పావును కదుపుతున్నారన్న అభిప్రాయం కలుగుతోందని టీడీపీ ముఖ్యలు అనుమానిస్తున్నారు. ఐరాస సమావేశంలో ప్రసంగించేందుకు చంద్రబాబు 23న అమెరికా వెళ్తున్నారు. సరిగ్గా దీనికి రెండు రోజుల ముందు కోర్టులో చంద్రబాబు బృందాన్ని హాజరు పరచాలని వారెంటు జారీ కావడం.. ఆయన్ను అందులో పాల్గొనకుండా చేసేందుకేనని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి కేసుల్లో కోర్టుకు హాజరయ్యారా... దాని వల్ల తర్వాతి పరిణామాలు ఎలా ఉన్నాయన్నదానిపై పార్టీ వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read