ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మేజిస్ట్రేట్‌ జారీ చేసిన వారెంటు సమాచారం రాష్ట్ర పోలీసులకు శనివారం వరకు అందలేదు. ముందుగా, మహారాష్ట్ర పోలీసులు, అమరావతి వస్తున్నారని, మీడియా ద్వారా లీక్ ఇచ్చారు. దీంతో, మహారాష్ట్ర పోలీసులు వస్తారేమో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే, ఇప్పటి వరకు, ఎవరూ రాలేదు. నోటీస్ ఇవ్వలేదు. ప్రభుత్వ వర్గాలు దీనిని ధ్రువీకరించాయి. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనకు సంబంధించి ధర్మాబాద్‌ కోర్టు ఆయన అరెస్టుకు నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

notiece 16092018 2

అరెస్టు వారెంటు జారీ అయిన వ్యక్తి పొరుగు రాష్ట్రంలో ఉంటే.. అక్కడి పోలీసులు ఆ వ్యక్తి ఉన్న రాష్ట్రంలోని పోలీసులకు ఈ విషయం తెలియజేస్తారు. మామూలుగా అయితే కోర్టు ఆదేశం ప్రకారం ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి నిర్ణయించిన తేదీన ఆ కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటే అరెస్టు దాకా వెళ్లకుండా సంబంధిత కోర్టుకు ఆ తేదీన హాజరై వారెంటును కొట్టి వేయించుకోవాలని సలహా ఇస్తారు. ఒక్కోసారి ఆ వ్యక్తి తరపు న్యాయవాది కోర్టుకు హాజరై వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ వేస్తారు. ఇవి సాధారణంగా జరిగే వ్యవహారాలు. కానీ ఈ కేసులో ముఖ్యమంత్రి ఉండడంతో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

notiece 16092018 3

మహారాష్ట్ర కోర్టు జారీచేసిన అరెస్టు వారెంటు సమాచారం అధికారికంగా అందకపోతే ఏం చేయాలన్నదానిపైనా న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ‘అరెస్టు వారెంటు జారీ అయినట్లు పత్రికల్లో వార్తలు రావడం వేరు. ఏదో రూపంలో అధికారికంగా ఆ సమాచారం మాకు అందాలి. అది ఇంతవరకూ రాలేదు’ అని సీఎం కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. గతంలో నోటీసులు ఇచ్చినా ముఖ్యమంత్రి హాజరు కాలేదన్న ఆరోపణను తోసిపుచ్చారు. ‘మాకు నోటీసులు అందజేసినట్లు వారి వద్ద ఏదైనా ధ్రువీకరణ ఉండాలి కదా! ఊరకే రాజకీయ ఆరోపణలు చేస్తే సరిపోదు. అసలక్కడ కేసు పెండింగ్‌లో ఉందన్న సమాచారమే ఎవరికీ లేదు. సీఎం చంద్రబాబు చిరునామా తెలియక సమాచారం పంపలేకపోయామని తప్పించుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే. కోర్టులో ఒక కేసుకు సంబంధించి న్యాయమూర్తి విచారణ తేదీని నిర్ణయించినప్పుడు అందులో నిందితులుగా ఉన్న వారికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అక్కడి పోలీసులది. న్యాయమూర్తిది కాదు. న్యాయమూర్తి నోటీసు ఇస్తారు. దానిని అందజేయాల్సిన విధి పోలీసులది. ఆ పని వారు చేయలేదు’ అని ఆయన వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read