ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కేరళ ముఖ్యమంత్రి విజయన్ లేఖ రసారు. వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఇచ్చిన 10 కోట్లు, వివిధ సంఘాల నుంచి ఇచ్చిన మిగతా డబ్బులు, మెటీరియల్ కలిపి, 40 కోట్లు ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. పక్క రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, సరైన సమయంలో మీరు చూపించిన చొరవకి, మనందరం ముందు భారతీయలం అనే భావం వ్యక్తం అయ్యిందని, చాలా సంతోషం అంటూ, కృతజ్ఞతలు చెప్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కేరళ ముఖ్యమంత్రి విజయన్ లేఖ రసారు.
వరదల వల్ల కష్టాల్లో ఉన్న కేరళకు ఏపీ ప్రభుత్వం రూ.51 కోట్లకు పైగా సాయాన్ని పంపింది. కేరళ సచివాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ తరఫున ఉపముఖ్యమంత్రి చినరాజప్ప చెక్కులు అందించారు. కేరళ సీఎం పినరయి విజయన్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో చెక్కులను ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి జయరాజన్‌కు అందించారు. ఉపముఖ్యమంత్రి వెంట రియల్‌టైం గవర్నెన్స్ సొసైటీ సీఈవో బాబు ఉన్నారు. ఈ సందర్భంగా జయరాజన్ మాట్లాడుతూ కష్టకాలంలో అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కేరళను అన్ని విధాల ఆదుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారన్నారు.
కేరళకు అందించిన రూ.51కోట్ల సాయంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.10కోట్లు, ఏపీ ఎన్జీవోల ఒకరోజు వేతనం రూ.20కోట్లు, తదితరాలు ఉన్నాయి. వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.51 కోట్లకుపైగా సాయం అందచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.51.018 కోట్ల నగదు, సహాయ సామగ్రిని మంగళవారం కేరళకు పంపింది. ఇందులో రూ.35 కోట్ల విరాళం కాగా, మిగిలినవి సహాయ సామగ్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.10 కోట్లు, ఏపీ ఎన్జీఓలు తమ ఒక రోజు వేతనం విరాళంతో ఇచ్చిన .20 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఒక రోజు వేతనం విరాళంతో ఇచ్చిన రూ.కోటి, పీఐఐసీ నుంచి రూ.17 లక్షల విరాళం, ఆర్టీజీఎస్ ఉద్యోగుల ఒక రోజు వేతనం విరాళంతో ఇచ్చిన రూ.8.09 లక్షలు, పౌరసరఫరాల శాఖ పంపిన రూ.6 కోట్ల విలువైన 2,014 మెట్రిక్ టన్నుల బియ్యం, కృష్ణా జిల్లా నుంచి పంపిన రూ.కోటి విలువైన సామగ్రి, విశాఖపట్నం నుంచి పంపిన రూ.10వేల దుప్పట్లు ఇతరత్రా సహాయ సామగ్రి ఇందులో ఉన్నాయి.