నిన్న కెసిఆర్, తెలంగాణా అసెంబ్లీ రద్దు చేస్తూ, ఎలా పెలాడో అందరూ చూసారు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం పై మరోసారి తన కడుపు మంట చూపించారు. చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసారు. కెసిఆర్ నిన్న మాట్లాడుతూ, ఆంధ్రా అనే మాట తెలంగాణాలో వినపదకూడదు అని, ఇంకా ఆంధ్రా నాయకులు మనకు ఎందుకు అంటూ, తీవ్ర విమర్శలు చేసారు. ఆంధ్రా ప్రాంతం పై, నాలుగేళ్ళు దాటుతున్నా, కెసిఆర్ కి ఎంత విద్వేషం ఉందో, ఈ మాటలను బట్టి అర్ధమావుతుంది. అంతే కాదు, చంద్రబాబుని నేలకేసి కొట్టాం, ఇంకా చంద్రబాబు పార్టీ ఎక్కడ ఉంది అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
ఈ వ్యాఖ్యల పై, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి, ఆంధ్రపదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఓ పక్క తెలుగువారంతా కలిసుండాలంటూనే జాగో బాగో అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను లోకేశ్ తప్పుపట్టారు. తెరాస మొత్తం తెలుగుదేశం వాళ్ళతో నింపుకుని, మళ్ళీ తెలుగుదేశం ఆంధ్రా పార్టీ అని విషం చిమ్ముతున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో మండలికి వెళ్తూ లోకేశ్ తెలంగాణ పరిణామాలపై కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్ఎంసీని తెరాస చేజిక్కించుకుందా? అని లోకేశ్ నిలదీశారు. ఆంధ్రా ప్రాంతం వారు అంటే ఇంత లెక్క లేని తనం పనికిరాదని, ఈ ఆంధ్రా ప్రజలే రేపు, ఎవరు ఏంటో నిర్ణయిస్తారని అన్నారు. నిజానికి, కెసిఆర్ ఇలా ఆంధ్రా ప్రాంతం పై విషం చిమ్మటం ఇది మొదటిసారి కాదు. అసలు కెసిఆర్ రాజకీయం నడుస్తుందే, ఆంధ్రా ప్రాంతం పై నిత్యం ఏడుస్తూ.. కాని, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాళ్ళ ఓట్లు మాత్రం కావలి.. తెలంగాణాలో జనాలే ఛీ కొడుంటే, ఇంకా ఆంధ్రా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కెసిఆర్ కి త్వరలోనే తెలుస్తుంది. మోడీతో అంటకాగుతూ, ఆంధ్రా పై కుట్రలు చేస్తున్న వారికి, ఆంధ్రా ప్రజలు, సెటిలర్లు తగిన బుద్ధి చెప్తారు.