జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కార గ్రహీత మేకా సుసత్య రేఖపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. చిన్నారులకు అర్ధమయ్యేలా ఆసక్తికరంగా గణితం బోధిస్తున్నారని ప్రశంసించారు. సుసత్య రేఖ కుటుంబంలో అందరూ ఉపాధ్యాయులే. అమ్మ సత్యవతి దేవి, తాత వెంకన్న చౌదరి హిందీ పండిట్లుగా, నాన్న సత్యనారాయణ సోషల్ టీచర్‌గా రిటైర్ అయ్యారు. భర్త గురయ్య, అక్క ఇంద్రాణి, బావ వీరన్న, చెల్లెలు పద్మజారాణి, మేనమామ సత్యనారాయణ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. కుటుంబంలో మొదటిసారిగా తమ కుమార్తె జాతీయ పురస్కారం సాధించడం ఆనందంగా ఉందని సుసత్య రేఖ అమ్మ సత్యవతి దేవి చెప్పారు.

teacher 05092018 2

ఇది ఇలా ఉండగా, దేశ వ్యాప్తంగా 374కి అవార్డులు ప్రకటిస్తే, మన రాష్ట్రం నుంచి ఒక్కరే ఎంపిక కావటం పట్ల చర్చ జరుగుతుంది. 2016లో రాష్ట్రం నుంచి 10 మంది ఉపాధ్యాయులను జాతీయ అవార్డులకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ సారి వాటి సంఖ్యను ఒకటికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. నవ్యాంధ్రపై కేంద్ర సర్కారు వివక్ష చూపిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా, 2017 సంవత్సరానికి సంబంధించి ఒక్కరినే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాను చూసిన రాష్ట్ర ఉపాధ్యాయులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అంటున్నారు. విద్యా రంగంలో దేశంలోనే మంచి స్థానంలో ఉన్న ఏపీలో జాతీయ స్థాయి అవార్డులకు అర్హత కలిగిన గురువులు లేరా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

teacher 05092018 3

కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు తాజాగా ఆరుగురు ఉపాధ్యాయలను ఎంపిక చేసి ఆ జాబితాను రాష్ట్రం పంపించింది. కానీ, ఆ జాబితా నుంచి ఏకంగా ఐదుగురి పేర్లను తొలగించి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మేకా సుసత్యరేఖను మాత్రమే ఎంపిక చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున, కేరళ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి పంపమని కోరిన కేంద్రం.. ఆ మేరకు అందరినీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేయడం గమనార్హం. బాగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని గుర్తించి ప్రోత్సహించేందుకు, జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని పెంచేందుకు ఈ అవార్డులను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం 1958వ సంవత్సరంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read