అసాధ్యం సుసాధ్యమవుతుంది.. ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన 57 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జర గడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటుతుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది.
నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల ఏడాదికాలంలోనే సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాల కలగా ఉన్న పోలవరంలో ఎట్టకేలకు కదలిక రావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ అద్భుతం చూడటానికి, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ప్రభుత్వం ఫ్రీగా బస్సులు పెడుతూ ఉండటంతో, రైతులు వచ్చి చూస్తున్నారు. దీంతో పోలవరం సందర్శనకు వచ్చే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టును చూసిన వారి సంఖ్య లక్షా రెండు వేలు దాటింది.
ఇంత మంది ప్రజలు వచ్చి ఈ అద్బుతం చూస్తున్నా, మన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి మాత్రం, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ చుదలనిపించలేదు. ఎందుకో మరి, ఆయనకే తెలియాలి. ఇదే విష్యం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటి వరకూ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షా 2వేల మంది సందర్శించారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత జగన్కు మాత్రం అక్కడికి వెళ్లే తీరక లేదని ఎద్దేవా చేశారు. మాట్లాడితే రాజన్న రాజ్యం తెస్తానని చెబుతున్న జగన్.. ఆయన హయాంలో మంత్రులు, ఐఏఎస్లు జైలుకెళ్లిన విషయం గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. రైతులకు మేలు చేద్దామని ప్రాజెక్టులు కడుతుంటే.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంపై పోరాటం చేసేందుకు సభలు నిర్వహిస్తుంటే అల్లరిమూకల్ని పంపి భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.