స్వాతంత్రం వచ్చి మనకు 72 సం"లు అయిన, అద్దె కోసం స్థానం కలిపించిన వారి ఇంటిలో చనిపోయిన వారికి మాత్రం మన ఇంటి ముందు ఉంచలేక పోతున్నాం. ఇన్ని సం" లుగా ఎంతోమంది నాయకులు వస్తు, పోతు వున్నారు కానీ ఎవరు కూడా ఈ సమస్య ను పరిష్కరించే నాయకులు లేరు. కానీ ఈనాడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ వట్టి, మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అనిన గురజాడ అప్పారావు గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పూర్తితో, ఆంధ్రప్రదేశ్ లోని కాదు, భారత దేశంలో ఎక్కడ లేని విధంగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, ఎమ్మల్యే బొండా ఉమామహేశ్వరరావు అభివృద్ధి నిధులలో భాగంగా, కుల , మతాలకు అతీతంగా అంతి మయాత్ర భవనమును నిర్మించారు.
బొండా ఉమా గారు మాట్లాడుతూ అందరికీ అనివార్యమైన మరణాని ఎవరు తప్పించలేరు, అంటువంటి పరిస్థితులలో అద్దెకు వుండే వారు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన మంజూరు చేయటం, అలాగే ఉచితంగా ఫ్రీజర్ బాక్స్ లు అందించటానికి వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు, నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ లోని సమస్యల పై అవగాహన వుందని, ఒక్క ప్రణాళిక ప్రకారం ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
విజయవాడలో 1.8 లక్షల కుటుంబాలు, అద్దె ఇళ్ళల్లో ఉంటున్నాయని, ఎవరన్న చనిపోతే, చాలా చోట్ల ఇంటి యజమానులు, దేహాన్ని అక్కడ ఉంచటానికి ఒప్పుకోవటం లేదని, సరైన అంతిమ కార్యక్రమాలు కూడా చెయ్యకుండా, చివరి మజిలీ జరిగిపోతుంది అని గ్రహించి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉమా చెప్పారు. ఈ అంతిమ యాత్ర భవనంలో ఒకేసారి నాలుగు బాడీలు పెట్టుకోవచ్చని చెప్పారు. దీని కోసం 40 లక్షల నిధులు ఖర్చు పెట్టగా, దాతల నుంచి 10 లక్షల విలువ గల, ఫ్రీజర్ లు, వాహనాలు సమకుర్చినట్టు చెప్పారు. ఇక్కడ రూమ్స్ ఉంటాయని, బాత్ రూమ్స్ ఉంటాయని, మంచినీటి సదుపాయం ఉంటుందని, ఎవరన్నా చనిపోతే, ఇక్కడకు తీసుకువచ్చి, అంతిమ కార్యకరమాలు ముగించుకుని, స్మశానానికి తీసుకువెళ్లచ్చు అని చెప్పారు. అద్దె ఇళ్ళల్లో నివాసించే వారు తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో, తమ బంధువుల చివరి చూపు కోసం ఈ అంతిమ యాత్ర భవన్ ఉపయోగించుకోవచ్చని చెప్పారు.