ఎప్పుడూ హాట్ హాట్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్స్ తో కూల్ గా ఉన్నాయి... ఒక పక్క తన సమకాలీకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి. మరో పక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపాకుడి కొడుకు, హరికృష్ణ జయంతి. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. చంద్రబాబు వీరి ముగ్గురి గురించి ట్వీట్ చేసారు. రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేసారు. హరికృష్ణ జయంతి సందర్భంగా, ఆయన్ని గుర్తు చేసుకుంటూ, వారి స్పూర్తితో ముందుకు వెళ్తామని ట్వీట్ చేసారు.
ఇకజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని, చంద్రబాబు, పవన్ కి ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. ఒక పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబుని పర్సనల్ గా టార్గెట్ చేసినా, చంద్రబాబు మాత్రం పవన్ కి విషెస్ చెప్పారు. లోకేష్ కూడా విష్ చేసారు. మరో పక్క తనను ఎంతో ఇబ్బంది పెట్టిన రాజశేఖర్ రెడ్డికి కూడా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో ఎన్ని ఉన్నా, ఒక పద్ధతి అనేది, నేటి తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. చంద్రబాబు ఎప్పుడూ లైన్ దాటి విమర్శలు చెయ్యరు.
నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా అనేక సందర్భాల్లో చాలా మందికి విషెస్ చెప్పారు... ప్రధాన మంత్రి దగ్గర నుంచి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్యులు ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు... పండగలప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతారు.... పోయిన ఏడాది, ఏకంగా అందరూ టీవీలో లైవ్ చూస్తూ ఉండగా, అసెంబ్లీ సమావేశాలు జారుతూ ఉండగా, జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని, చంద్రబాబు విషెస్ చెప్పారు... చంద్రబాబు స్వయంగా జగన్ సీట్ దగ్గరకు వెళ్లి విషెస్ చెప్పారు... వైఎస్ఆర్, హరికృష్ణ అంటే మన మధ్య లేరు కాబట్టి, ఏమి చెయ్యలేం... కనీసం పవన్ అయినా, చంద్రబాబు ట్వీట్ కి రిప్లై ఇచ్చి, గౌరవప్రదంగా రాజకీయాలు చెయ్యాలు చెయ్యాలని ఆశిద్దాం...