ఈ రోజు ఉదయం మీడియాలో వచ్చిన కధనాలు చూసి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుగా ఉంటూ, ప్రజలకు రక్షణ కలిపించాల్సింది పోయి, వారినే వంచిస్తున్న సిఐ పై ఫైర్ అయ్యారు. మహిళ పట్ల చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ వేధింపుల పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సీఐ తేజోమూర్తి పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

cbn 19092018 2

మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తనకు తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకోవడం పై మదనపల్లెకు చెందిన సంయుక్త అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బాధితురాలిపై కన్నేసిన స్టేషన్ సీఐ తేజోమూర్తి తన కోరిక తీర్చాలని వేధించాడు. తిరుమల కొండ పై తాను విధులు నిర్వహిస్తున్నాననీ, వస్తే ఇద్దరం కలసి ఎంజాయ్ చేద్దామని ఒత్తిడి చేశాడు. రెండు రోజుల కిందట ఫోన్ చేసి తిరుమలకు రావాలని చెప్పినట్లు ఆమె చెబుతున్నారు. నందకం రెస్ట్‌హౌస్‌లో గదిని బుక్ చేశానని సీఐ చెప్పినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు.

cbn 19092018 3

నిన్న మహిళా సంఘాలను వెంటబెట్టుకుని తిరుమలకు వచ్చిన బాధితురాలు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో విషయం పసిగట్టిన తేజమూర్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయంపై బాధితురాలు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని కలిసేందుకు ప్రయత్నించారు. మరోవైపు విషయం తెలుసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్, తేజామూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరో మహిళకు ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదని తాను ధైర్యంగా ముందుకు వచ్చానని బాధితురాలు చెబుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read