ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసి, మోడీ ఫ్రంట్ లో చేరిన కెసిఆర్ పార్టీ, అసలు రంగులు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం పై సపోర్ట్ ఇవ్వని టీఆర్ఎస్ పార్టీ, మొన్న మరింత ముందుకెళ్ళింది. కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరితే తాము వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్‌ తెలిపింది. అయితే, ఈ రోజు ఇంకాస్త ముందుకెళ్ళి, డిప్యూటీ చైర్మెన్ ఎన్నికలో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చింది, తెరాస. అయితే, ఉదయం ఇలా మద్దతు ఇచ్చిందో లేదో, సాయంత్రం, కెసిఆర్ కు షాకింగ్ వార్త వినిపించింది కేంద్రం. వాడుకుని వదిలేయటంలో, మోడీ-షా ఎలాంటి వారో మరోసారి రుజువైంది.

kcr 09082018 2

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అవకాశం లేదని చెప్పింది. కాళేశ్వరం, పాలమూరుకు రెండింట్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలన్న ఎంపీ వినోద్ లేఖకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తర్వాత ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఉండదని ఆయన తేల్చి చెప్పారు. గడ్కరీ సమాధానం తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని ఎంపీ వినోద్ అన్నారు. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు కాళేశ్వరానికి రూ. 20 వేల కోట్లు సాయం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. అయితే, ఇవేమీ కేంద్రం పట్టించుకోలేదు.

kcr 09082018 3

అవసరం తీరగానే, కెసిఆర్ కే, తెలంగాణా రాష్ట్రం మొత్తానికి షాక్ ఇచ్చారు. ఇన్నాళ్ళు మోడీ పై కలిసి పోరాడదాం రమ్మంటే, కెసిఆర్ వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికైనా కెసిఆర్ కు నిజంగా, తన రాష్ట్రం పై చిత్తశుద్ధి ఉంటే, అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి వచ్చి,మోడీ పై పోరాటం చెయ్యాలి. లేకపోతే, కెసిఆర్ కూడా, మోడీ - అమిత్ షా లకు లొంగిపోయాడు అని ప్రజలు నమ్ముతారు. కవిత మద్దతు తెలపటంతో, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా, "చెల్లెలు కవిత గారికి ధన్యవాదాలు అంటూ" ట్వీట్ కూడా చేసారు. మరి ఇప్పుడు తెరాస చేస్తున్న దాని పై, తెలంగాణలో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరో ఆయనకే తెలియాలి. ఏది ఏమైనా, తెలుగువారు అందరూ కలిసి ఉంటే, మోడీ లాంటి బలమైన నేతను ఎదుర్కోవచ్చు. కెసిఆర్ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారని ఆశిద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read