ఎవరి కులం వారికి గొప్ప, ఎవరి మతం వారికి గొప్ప.. మన మతం గురించో, కులం గురించో గొప్పగా చెప్పటంలో తప్పు లేదు, కాని ఎదుటి వాడి కులాన్ని, మతాన్ని తక్కువ చేస్తే, ఇలాంటి వారు సమాజానికి చాలా ప్రమాదకరం. అలాంటిది జాతీయ పార్టీలు లాంటివే, మతం పేరుతో రాజకీయాలు చేస్తుంటే, ఇక ఎవరికి చెప్పుకోవాలి. బీజేపీ పార్టీ హిందుత్వ అజెండా ఉన్న పార్టీ. ఎవరికీ ఇబ్బంది లేదు. అలా అని, హిందులు ఒక్కరే మనుషులు, మానవత్వం ఉన్న వాళ్ళు, దేశభక్తులు అని చెప్పి, మిగతా మతాల వారిని కించపరచటం ఎంత తప్పు. చివరకు ఈ ఉన్మాదం ప్రకృతి వైపరిత్యల పై కూడా పడింది. కేరళలో వరదలు వచ్చి అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. దీని పై కూడా రాజకీయం చేస్తుంది బీజేపీ పార్టీ.

bjp 19082018 2

కేరళ వరదల్లో మునిగిపోవడానికి శబరిమల వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యమే కారణమంటూ పలువురు బీజేపీ సానుభూతిపరులు, శనివారం చేసిన ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. ఆ ట్వీట్లపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ వరదలకు, శబరిమలలో మహిళల ప్రవేశానికి ముడిపెట్టి ట్వీట్‌ చేసిన వారిలో ఆర్‌బీఐ బోర్డు సభ్యుడితో పాటు ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రముఖుడూ ఉండటంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయారు. వరుస ట్వీట్లతో దాడి చేశారు. ‘‘వరదలను మతపరమైన విషయాలతో ముడిపెట్టొద్దు. మీరు ఏదైనా చేయగలిగితే వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయండి’’ అని నెటిజన్‌ మణికందన్‌ ఆగ్రహం వెలిబుచ్చారు.

bjp 19082018 3

ఈ సంఘటన చూస్తున్న వారికి, వైజాగ్ కి హూద్ హూద్ వచ్చిన టైంలో, వైసిపీ పార్టీ చేసిన ఉన్మాదం గుర్తుకు వస్తుంది. మా విజయమ్మను ఓడించిన వారికి దేవుడు విధించిన శిక్షే హూద్ హూద్ అంటూ, జగన్ ఉన్మాద అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో వీరు చేసిన పైశాచిక పోస్ట్ లు అన్నీ అన్నీ కావు. ఒక పక్క ప్రచండమైన తుఫాలు, వైజాగ్ లాంటి సిటీని అతలాకుతలం చేస్తే, ఇలా ఆనంద పడ్డారు జగన్ అభిమానులు. ఈ రోజు, కొంత మంది బీజేపీ ఉన్మాదులు పెట్టిన పోస్ట్ లు చూస్తుంటే, ఇలాంటి పార్టీలకు తమ పైశాచిక ఆనందమే కాని, నష్టపోతున్న ప్రజలకు వీళ్ళ వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read