విశాఖ గ్యాస్‍లీక్ ఘటన పై, చనిపోయిన వారికి కోటి ఇస్తే సరిపోతుంది అనుకున్న ఎల్జీ పాలిమర్స్ కి ఎన్జీసీ షాక్ ఇచ్చింది. మొత్తం ఇష్యూ ని 20 కోట్లతో ముగించేద్దాం అనుకున్న ఎల్జీ పాలిమర్స్ కు అదిరిపోయే షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ కేసు పై విచారణ ప్రారంభించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎల్జీ పాలిమర్స్ కు నోటీసులు ఇచ్చింది. కేంద్రం, ఎల్జీ పాలిమర్స్, సెంట్రల్ పీసీబీకి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. అంతే కాదు, ముందుగా, ప్రాధమికంగా రూ.50 కోట్లు స్థానిక కోర్టులో డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలిమర్స్ సంస్థకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం. భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్న ఎన్జీటీ, ఎల్జీ పాలిమర్స్ కు భారీ నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించే అవకాసం ఉందని చెప్తున్నారు. ఇది కేవలం మరణించ వారికి కోటి రూపాయలు ఇస్తే సరిపోదని, నిన్నటి నుంచి అందరూ వాదిస్తూనే ఉన్నారు. ఆ గ్యాస్ పీల్చిన వారు, జీవితాంతం ఇబ్బందులు పడుతూనే ఉంటారని, అక్కడ ఉన్న మొత్తం 25 వేల మందికి, భారీగా నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
అలాగే అక్కడ భూమి, నీరులో కూడా ఈ గ్యాస్ అవశేషాలు ఉండి పోవటం, ఇవన్నీ చూస్తూనే, అక్కడ వాతావరణం మొత్తం, ఈ కంపెనీ చేసిన పని వల్ల నష్టం వాటిల్లిందని, పాడి పశువులు కూడా మరణించటంతో, అక్కడ ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చనిపోయిన 12 మందికి, కంపెనీ ఇన్సురన్సు ద్వారా, కోటి ఇచ్చి చేతులు దులుపుకుందాం అని చూసిన ఎల్జీ పాలిమర్స్ కు, ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. ప్రాధమికంగానే, 50 కోట్లు డిపాజిట్ చేయ్యమంది అంటే, నిన్న జరిగిన నష్టం మొత్తం, ఈ కంపెనీ నుంచి రాబట్టే అవకాసం ఉంది. అయితే, ఇవన్నీ తేలే సరికి ఎన్ని ఏళ్ళు పడుతుందో అనే వాదన కూడా వస్తుంది. భోపాల గ్యాస్ విషాదం పరిహారం, దాదపుగా 20 ఏళ్ళు తరువాత వచ్చిందని, ఆ కంపెనీకి వేసిన ఫైన్, ఇప్పటికీ కట్టలేదనే వాదన వినిపిస్తుంది.
విపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయం పై స్పందించింది. వర్ల రామయ్య మాట్లాడుతూ, విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదానికి కారకులైన యాజమాన్యాన్ని తక్షణం అరెస్ట్ చేయాలని అన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రమాదానికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ ప్రభావ అంచనా (EIA) సర్టిఫికెట్ లేకుండా కంపెనీని ఎలా ప్రారంభించారు ? పాలిమర్స్ యాజమాన్యం నుంచి విజయసాయిరెడ్డి ట్రస్ట్ బలవంతాన ఎంత డబ్బు వసూలు వేసిందో బయటపెట్టాలని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రేమ వ్యక్తం చేస్తున్నారు? ఇంతటి దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా వ్యవహరించడం తగదని కోరారు.