బీజేపీ పార్టీకి దేశ వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 10 ఎంపీ స్థానాలను పోగొట్టుకున్న బీజేపీ, వివిధ రాష్ట్రాల్లో కూడా తిరోగమనంలో ఉంది. కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మూడు కీలక బీజేపీ-పాలిత హిందీ బెల్ట్‌ రాష్ట్రాలు- రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌‌‌గడ్‌ల్లో కాంగ్రెస్‌ విజయఢంకా మోగిస్తుందని ఏబీపీ-సీ ఓటర్‌ జరిపిన ఓ సర్వే అంచనా వేసింది. రాజస్థాన్‌లో 200 సీట్లకు గాను 130 స్థానాలు, ఛత్తీగఢ్‌లో 90 స్థానాలకు గాను 54 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకు గాను 117 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని సర్వే జోస్యం చెప్పింది. ఒక్క మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించవచ్చని, అయినప్పటికీ అధికారం చేపట్టే అవకాశాల్లేవని ప్రజల నాడి బట్టి తెలుస్తోందని పేర్కొంది.

modi 14082018 2

నాలుగు నెలల కిందట ఇదే గ్రూపు జరిపిన సర్వే మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీగా సీట్లు కోల్పోతుందని, చత్తీ్‌సగఢ్‌లో ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. ఈ సారి చత్తీ్‌సగఢ్‌లో పరాజయం తప్పదని పేర్కొనడం విశేషం. అయితే ఒక్క రాజస్థాన్‌లో తప్ప మధ్యప్రదేశ్‌, చత్తీ్‌సగఢ్‌ రెంటిలోనూ 2 పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 2% లోపే ఉండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఇదే రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీదే విజయమని సర్వే వెల్లడించింది. ప్రధానిగా ఎవరు అర్హులన్న ప్రశ్నకు 53.8% మంది మోదీకే ఓటేశారని, 46.2% మంది రాహుల్‌ అని బదులిచ్చారని వివరించింది.

modi 14082018 3

సర్వే అంచనాలు వాస్తవరూపం దాలిస్తే- అది రాహుల్‌కు కొత్త టానిక్‌ అవుతుంది. మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఓటమి 2019కి సంబంధించినంత వరకూ బీజేపీకి అశనిపాతమే అవుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఓడిపోతుంది అని తెలిసే, మోడీ, షా భయపడి ఎన్నికలకు వెళ్ళటం లేదనే అభిప్రాయం ఉంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌‌‌గడ్‌ల్లో బీజేపీ ఓడిపోతుందని బీజేపీ వాళ్లకు కూడా తెలుసు. అందుకే, వీటికి ఎన్నికలు జరపకుండా, లోక్ సభ ఎన్నికలతో పాటు జరపటానికి, జమీలీ అనే కొత్త కాన్సెప్ట్ తో మోడీ, ముందుకు వస్తున్నారు. ఇప్పుడే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి, బీజేపీ ఓడిపోతే, ఈ ప్రభావం వచ్చే ఎన్నికల పై పడుతుంది అని మోడీ, షా అభిప్రాయం. వీరి అభిప్రాయాలకు తగ్గట్టు గానే, సర్వేల్లో కూడా, బీజేపీ ఓటమి తధ్యం అని చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read