రాజ్యసభ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఒక ప్రధాని మాట్లాడిన మాటలు రికార్డుల నుంచి తొలగించాల్సిన పరిస్థితి, మన దేశానికి వచ్చింది. చట్ట సభల్లో సాక్షాత్తు ప్రధాని మాట్లాడిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇలా తొలగించటం, ఇదే మొదటిసారని చెప్తున్నారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎన్‌డిఎ అభ్యర్థి హరివంశ్‌ నారాయణసింగ్‌ ఎన్నికైన తరువాత గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రతిపక్ష అభ్యర్థి బి.కె. హరిప్రసాద్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను చైర్మన్‌ వెంకయ్యనాయుడు శుక్రవారం రికార్డుల నుండి తొలగించారు. రాజ్యసభ చరిత్రలోనే ఇది అరుదైన అంశం. ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ కుమార్‌ ఝా రూల్‌.నెం. 238 కింద ఈ అంశాన్ని లేవనెత్తారు.

modi 10082018 2

మొద‌టిసారి ప్రధాని మోదీ ఇవాళ రాజ్యసభలో చేసిన కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మ‌న్‌గా గెలిచిన‌ హరివంశ్‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన మోదీ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను విపక్ష అభ్యర్థి హరిప్రసాద్ తప్పుపట్టారు. త‌న‌పై ప్ర‌ధాని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశార‌ని హరిప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. దీంతో ప్ర‌ధాని మోదీ ప్రసంగం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది. వెంకయ్య తీసుకున్న చర్య పై, అందరూ అభినందించారు. సాక్షాత్తు ప్రధాని తప్పు చేసినా, నిబంధనలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో, వెంకయ్యను అభినందించారు.

modi 10082018 3

హరిప్రసాద్ మాట్లాడుతూ, ప్రధాని స్థాయి వ్యక్తి, చట్ట సభల్లో ఇలా మాట్లాడటం ఎప్పుడూ లేదని, సాక్షాత్తు ప్రధానే ఇలా మాట్లాడి, సభ గౌరవాన్ని తక్కువ చేసరాని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించినట్టు, రాజ్యసభ సెక్రటరీ కూడా దృవీకరించారు. గురువారం జరిగిన రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి, జనతాదళ్‌(యూ) ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ 125 ఓట్లు తెచ్చుకుని విజయం సాధించారు. విపక్ష అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్‌ నాయకుడు బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్టీలకు అతీతంగా నేతలంతా హరివంశ్‌ను అభినందించారు. వెంకయ్య, మోదీ, గులాంనబీ ఆజాద్‌, జైట్లీ కలిసి హరివంశ్‌ను సభలో ఉపాధ్యక్షుడి కోసం ప్రత్యేకించిన స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read