వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులు, గత సంవత్సరం నుంచి చాలా నెమ్మదిగా నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల చేతే, సాగుతూ నడుస్తున్నాయి. కేసుల విచారణ అయితే లేట్ చెయ్యవచ్చు కాని, ఏ నాటికైనా శిక్ష తప్పదు అని లాలూ, జయలలిత కేసులు చుస్తే అర్ధమవుతుంది. అయితే, జగన్ కేసులు బాగా నెమ్మదించాయి అని అనుకుంటున్న టైంలో, ఈడీ ఒక అడుగు ముందుకేసింది. సిబిఐ పట్టించుకోకపోయినా, నేను వదలను అంటూ రంగలోకి దిగింది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన సతీమణి వైఎస్‌ భారతి పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ పరిణామంతో అందరూ ఆశ్చర్యపోయారు.

jagan 1082018 2

భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తో పాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల కొత్త చార్జిషీటు దాఖలు చేసింది. భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే సీబీఐ మూడు చార్జిషీట్లు వేసింది. ఈ చార్జిషీట్లలో భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలో బాగా ప్రచారం జరిగింది. కానీ సీబీఐ ఆ పనిచేయలేదు. సీబీఐ వదిలేసినా... ఈడీ దర్యాప్తు నుంచి భారతి తప్పించుకోలేకపోయారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలు చేశారు.

jagan 1082018 3

కోర్ట్ కనుక ఈ చార్జిషీట్ ను కూడా విచారణకు స్వీకరిస్తే, ఇక జగన్ మోహాన్ రెడ్డి సతీసమేతంగా, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణలో భాగంగా జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరవుతున్నారు. భారతి సిమెంట్స్‌లో మనీలాండరింగ్‌పై ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కూడా కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్‌, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంటుంది.

jagan 1082018 4

జగన్‌ కంపెనీల్లోకి అక్రమ పెట్టుబడులకు సంబంధించిన మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఫార్మా కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి దర్యాప్తు పూర్తిచేసి ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేయగా... ఇప్పుడు భారతీ సిమెంట్స్‌కు సంబంధించిన అక్రమ లావాదేవీలపై అభియోగపత్రం దాఖలు చేసింది. సీబీఐ సమర్పించిన 11 చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మరిన్ని అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు.

jagan 1082018 5

ఈడీ తన చార్చిషీటులో జగన్‌, భారతితోపాటు ఆడిటర్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి, భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌, జెల్లా జగన్‌మోహన్‌ రెడ్డి (జేజే రెడ్డి), సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యూటోపియా ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగతవ్‌ సన్నిధి ఎస్టేట్స్‌తోపాటు గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఐబీఎంకు చెందిన వి.ప్రభు షెట్టార్‌, మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర నారాయణను నిందితులుగా పేర్కొంది.

jagan 1082018 6

ఇదీ అసలు అభియోగం... ఎవరైనా లోన్ కావాలంటే బ్యాంకుకు వెళ్లాలి. వాళ్లు కోరిన పత్రాలు చూపించాలి. అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. గ్యారెంటీలు ఇవ్వాలి. ఇలా అనేక లాంఛనాలు పూర్తి చేసి, అంతా ఓకే అనుకుంటే తప్ప లోన్ ఇవ్వరు. కానీ... వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో జగన్‌కు ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) అధికారులే సీఎం నివాసానికి వెళ్లారు. జగన్‌ను కలిశారు. ఆయన సంతకాలు తీసుకున్నారు. భారతీ సిమెంట్స్‌ కోసం రూ.200 కోట్ల టర్మ్‌ రుణాన్ని మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం అప్పటి ఓబీసీ నామినీ డైరెక్టర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి ఈ రుణం మంజూరులో కీలకపాత్ర పోషించారు.

jagan 1082018 7

రుణం కోసం దరఖాస్తులో తప్పుడు వివరాలు పేర్కొన్నట్లు ఆ తర్వాత తేలింది. భారతీ సిమెంట్స్‌ ద్వారా జగన్‌ అక్రమంగా రూ.5068.05 కోట్లు పొందినట్లు సీబీఐ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేపట్టి ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేసింది. అయితే రాజకీయంగా చూసుకుంటే, ఇది బీజేపీ కొత్త వ్యూహం అని కూడా విశ్లేషకులు అంటున్నారు. ప్రజల్లో జగ్గన్ +బీజేపీ ఒక్కటే అనేది బలంగా వెల్లింది, బీజేపీ కి ఎలాగూ డిపాజిట్లు రావు, వైసీపీ కి ఓట్లు పడాలంటే జగన్ కి బీజేపీ అండలేదు అని నమ్మించటానికే ఈ కొత్త నాటకమని, అదే వైఎస్ భారతి పై ఈడీ కేసు అని అంటున్నారు .

Advertisements

Advertisements

Latest Articles

Most Read