తప్పు చేసిన వాడిని, తప్పు చేస్తున్నావ్ అంటుంటే కూడా మన ప్రతిపక్ష నేతకు పోడుచుకువస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, నా ఇల్లు అమ్మటానికి పర్మిషన్ ఇవ్వండి అని రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా వేడుకున్నారు. కట్ చేస్తే, ముఖ్యమంత్రి అవ్వగానే, లోటస్ పాండ్ లు, బెంగుళూరు ప్యాలెస్ లు, సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్ లు, ఇలా లక్షల కోట్లు వెనకేశాడు జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికి 43 వేల కోట్లు నొక్కేసాడని, సిబిఐ కూడా తేల్చింది. 11 సిబిఐ కేసులతో, 5 ఈడీ కేసులతో, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్తున్నారు. అయితే, ఈడీ కొత్తగా జగన్ భార్య పై కూడా కొత్త చార్జిషీటు దాఖలు చేసింది.
భారతీని A5గా కొత్త చార్జిషీటు దాఖలు చేసింది. భారతి సిమెంట్స్‌లో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి, భారతి పై కూడా చార్జిషీటు దాఖలు చేసింది. అయితే, ఇంకా కోర్ట్ ఈ చార్జిషీటు పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకున్న తరువాత, ఆమె కూడా కోర్ట్ కు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే, ఈ వార్త పత్రికల్లో రావటంతో, ఉదయం జగన్ ఒక ట్వీట్ చేసారు. నా భార్య పై కొన్ని పత్రికలు మాత్రమే, కావాలని తప్పుడు వార్తలు రాస్తున్నాయి అంటూ, జగన్ ట్వీట్ చేసారు. అయితే, కొద్ది సేపటికి ఆ వార్త నిజమే అని, అన్ని జాతీయ పత్రికలు కూడా రాసాయి. దీంతో జగన్ మాట మార్చారు.
తీవ్ర అసహనంలో ఉన్న జగన్, ద్వంద్వ అర్ధాలు రాస్తూ, నీఛమైన భాషలో, బహిరంగ లేఖ రాసారు. ఉదయం కుట్ర అని చెప్పిన జగన్, ఆ వార్తా నిజం అని తేలటంతో, మాకు తెలియకుండా, మీడియాకు ఎలా తెలిసింది, అంటూ లేఖలో రాసారు. ఈడీలో చంద్రబాబుకు అనుకులంగా ఉన్న అధికారులు ఉన్నారంటూ రాసిన జగన్, చంద్రబాబు పై నీఛమైన భాష వాడారు. చంద్రబాబు, "పగలు, రాత్రి పద్ధతిలో", రెండు పార్టీలను చూసుకుంటున్నాడు అంటూ, అసభ్యకరమైన భాష వాడారు జగన్. ఈ లఖ చూస్తుంటే, జగన్ ఎందుకు ఇంత అసహనంగా ఉంటున్నారో అని విశ్లేషకులు అంటున్నారు. మొన్నటికి మొన్న పవన్ పై వ్యాఖ్యలు కాని, కాపు రిజర్వేషన్ పై మాటలు మార్చటం కాని, ఈ రోజు ఈ బూతులతో కూడిన లేఖ కాని చూస్తుంటే, జగన్ తీవ్ర అసహనంలో ఉన్నారని అర్ధమవుతుంది.