ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే చాలు, ఈ జాతీయ పార్టీలకు ఎందుకో కోపమో కాని, మన మీద ఎప్పుడూ వివక్ష చూపిస్తూనే ఉంటారు... వారికి ఇష్టమైన రాష్ట్రాలకు దోచిపెడుతూ, ఆంధ్రప్రదేశ్ కి మాత్రం విదల్చటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో అన్యాయం జరిగేది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మాత్రం, ఒక్కటని కాదు, ప్రతి రంగంలోనూ వివక్షే. ప్రధానంగా రహదారుల గురించి మాట్లాడుకుంటే, ఇలాంటి వివక్షే కనిపిస్తుంది. భారతమాల ప్రాజెక్ట్, అనంత-అమరావతి ఎక్ష్ప్రెస్స్ వే, రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్, ఇలా అనేక ప్రాజెక్ట్ ల కోసం, 2200 కిమీ సంబంధించిన ప్రతిపాదనలను, రాష్ట్రం, కేంద్రానికి పంపించింది. అయితే, కేంద్రంలోని అధికారులు మాత్రం, ఏపి నుంచి ఫైల్ వచ్చింది అనగానే, ఆ ఫైల్ తీసి పక్కన పడేస్తారు. ఇది రొటీన్ గా జరిగే ప్రాసెస్ అని ఢిల్లీలోని అధికారులు అంటున్నారు.

roads 26082018 2

రాయలసీమ జిల్లాలకు, రాజధాని అమరావతి కలుపుతూ, అనంతపురం-అమరావతి ఎక్ష్ప్రెస్స్ వే ను, 2015లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అప్పట్లో రాష్ట్రం పంపించిన ప్రతిపాదాలను, కేంద్రం భేష్ అంటుంది. ఆరు వరుసల రహదారి అద్భుతంగా ఉందని ప్రశంసించింది. 25వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపడతామని, కేంద్రం అప్పట్లో అంగీకరించింది. అయితే తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు రావటంతో, కేంద్రం నుంచి కొర్రీలు మొదలయ్యాయి. ఆరు వరుసలు, నాలుగు అయ్యాయి. భూసేకరణ, రాష్ట్రమే పెట్టుకోవాలని చెప్పింది. చివరకు ఈ ప్రాజెక్ట్ ని, ఎన్‌హెచ్‌ ప్రాజెక్టుల జాబితాలో చేర్చలేదు. రాష్ట్రం ఎన్ని సార్లు అడిగినా ఇదే తంతు. ఎందుకు చేర్చలేదు అంటే, రూ.25వేల కోట్ల ప్రాజెక్ట్ లు చేర్చటం లేదు అని చెప్పింది. కాని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రూ.21వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మాత్రం ఒకే చెప్పింది.

roads 26082018 3

అమరావతిలో నిర్మాణం చెయ్యాల్సిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు పరిస్థితీ కూడా ఇలాగే ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులో భాగంగా చేపడతామని అంగీకరించి, ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు మొండిచెయ్యి ఇచ్చింది. ఇదే సమయంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొత్తగా 8 నగరాలకు ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. గడిచిన నాలుగేళ్లలో మహారాష్ట్రలో 9518 కోట్లతో, కొత్తగా 3,900 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, చత్తీ‌సగఢ్‌‌లకు గడిచిన నాలుగేళ్లలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల కింద రూ.42వేలకోట్లపైనే కేటాయించారు. చత్తీ‌సగఢ్‌కు లాంటి చిన్న రాష్ట్రానికి కూడా, రూ.4200 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే, నాలుగేళ్లలో ఏపీ రహదారులకు ఇచ్చింది మాత్రం 3,280 కోట్లు మాత్రమే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read