గత శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి సోయగాలకు నిలువుటద్దంగా నిలుస్తున్న కేరళ రాష్ట్రాన్ని, ఉన్నపళంగా వరదలు బీభత్సం సృష్టించిన, నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం, సామాజిక స్పృహ కలిగిన పౌరులు చూపించిన విజ్ఞత, అందించిన సౌజన్యానికి కేరళ రాష్ట్ర ప్రజలు వివిధ సామాజిక మాధ్యమాల్లో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వందలాది మంది ఈ వరద బీభత్సానికి మృతి చెందగా, వేల సంఖ్యలో నిరాశ్రయులు కాగా, సుమారు 25వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిన పరిస్థితుల్లో యావత్ ప్రపంచం కదిలి వచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న ఆర్థిక, హార్థిక సహాయంతో పాటు ఉన్నతాధికారులసైతం, సామాన్య పౌరుడిగా వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై చిత్తశుద్ధితో తమ వంతు సహకారం పట్ల అక్కడి ప్రజలు తమ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

kerala 26082018 2

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉన్నతాధికారులు కేరళ రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లతో నేరుగా సంప్రదింపులు జరిపి మన రాష్ట్రం పక్షానే ఎంపిక చేసి, శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ సహాయ సహకార కార్యక్రమలను నిర్వహిస్తున్న తీరు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశ విదేశాల్లోని భారతీయులకు ఆదర్శంగా నిలుస్తోంది. కేరళ రాష్ట్రంలో వరదలు సంభవించిన తరుణంలోనే రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర వరదలు కారణంగా వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ కేరళ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితికి చలించిన రాష్ట్రప్రభుత్వం, స్వచ్ఛందసేవా సంస్థలు కలిపి ఇప్పటికే 2 వేల మెట్రిక్ టన్నుల బియాన్ని కేరళకు పంపిణీ చేయడం అక్కడి ప్రజానీకాన్ని విశేషంగా కదిలించింది. ఈ తీవ్ర వరద బీభత్సం కారణంగా ఆ రాష్ట్రంలో నేలకు ఒరిగిన కరెంటు స్తంబాలు, ట్రాన్స్ ఫార్మర్లను శీఘ్రగతిన పునరుద్దరించడంలో మన రాష్ట్ర విద్యుత్శాఖ సిబ్బంది చూపిస్తున్న సేవా భావం పట్ల అక్కడి ప్రజల్లో అత్యంత విశ్వాసం ఏర్పడింది.

kerala 26082018 3

రాష్ట్ర ప్రభుత్వం నగదు రూపంలో ఆ రాష్ట్రానికి రూ.10 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించిన నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వంతు సహకారాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ రాష్ట్రానికి అందజేశారు. ప్రభుత్వం అందించిన వస్తు సహకారంతో పాటు వివిధ స్వచ్చంద సేవా సంస్థలు, ఎన్జీవోలు, రోటరీ క్లబ్బుల ప్రతినిధులు విరాళాల రూపంలో సేకరించిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం ద్వారా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు నమూనాగా దర్శన మిచ్చింది. ప్రభుత్వ వర్గాల ద్వారా గాని, లేదా ఇతర మాధ్యమాల ద్వారా గాని ఇప్పటి వరకూ మన రాష్ట్రం నుండి కేరళకు ధన, వస్తురూపేణ అందిన వివరాలను విశ్లేషిస్తే.. గత రెండు మూడు రోజుల్లో 105 లారీలలో 2025 మెట్రిక్ టన్నుల బియ్యం కేరళకు చేరింది.

kerala 26082018 4

ఇక విద్యుత్ పునరుద్దరణకు వస్తే.. తీరుపతి ఎస్పీడీసీఎల్ కేంద్రం నుండి సుమారు 120 మంది విద్యుత్ అధికారులు, సిబ్బంది కేరళ రాష్ట్రానికి చేరుకొని అక్కడి భారీ వర్షాలకు ఛిన్నాభిన్నమైన విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తూ.. వరద బాధితులకు అంధకారంలో వెలుగులు చూపించిన మార్గదర్శకులుగా మారారు. అయితే పూడ్చుకోలేని నష్టంలో కూరుకుపోయి వరద బీభత్సానికి కుటుంబాలకు కుటుంబాలు ఛిన్నాభిన్నమైన పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ నుండి ఆ రాష్ట్రానికి అందుతున్న నిత్యావసర వస్తువులు కొంత మంది వరద బాధితులకైనా అక్కరకు వస్తున్నాయన్న సంతోషం కేరళ ప్రజానీకంలో వెల్లువిరుస్తోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో కేరళ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న సహాయ సహకారాల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు చేస్తున్న సందేశాలు ఇక్కడి వారికి మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read