తెలుగుదేశం పార్టీలో, ఈ మధ్య కాంగ్రెస్ తరహా ప్రజాస్వామ్య స్వేఛ్చ ఎక్కువైపోయింది... ఇది వరకు చంద్రబాబు వైఖరితో, మాట మాట్లాడాలి అంటే హడలి పోయే తెలుగుదేశం నేతలు, ఈ మధ్య మారిన చంద్రబాబు వైఖరి చూసి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, పార్టీ పొత్తుల గురించి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడే దాకా వెళ్ళింది. గత వారం రోజులుగా, తెలంగాణా రాష్ట్రంలో, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ పొత్తు గురించి వార్తలు వస్తున్నాయి. దీని పై, మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయారు. అయితే, చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాలను అర్థం చేసుకోకుండా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ ఎలాగో, ఇప్పుడు మోడీ అలగాని, మోడీని దించాలి అంటే కొన్ని తప్పవని అంటున్నారు.

ttdp 26082018 2

అయితే, ఈ మంత్రుల వ్యాఖ్యల పై, తెలంగాణ టీడీపీ నేతలకు మనస్తాపం కలిగించాయి. తెలంగాణలో టిడిపి పార్టీ ఉనికి, పార్టీ ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి వాక్‌ స్వాతంత్య్రం తమను ఇబ్బందికి గురి చేస్తోందని తెలంగాణా టీడీపీ నేతలు వాపోతున్నారు. ఈ అంశం పై పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తుల పై ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు టీడీపీ-టీఎస్‌ నేతలను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తుకు అవకాశం లేదన్న కోణంలో వారు ప్రకటనలు చేశారు.

ttdp 26082018 3

దీంతో తెలంగాణా టీడీపీ నేతలు అధిష్టానం వద్ద తమ అసంతృప్తిని, కినుకను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఎక్కడి రాజకీయ పరిస్ధితులు అక్కడ ఉన్నాయి. అక్కడ టీఆర్‌ఎస్‌ లేదు. ఇక్కడ వైసీపీ లేదు. బీజేపీకి టీడీపీ దూరమైంది. తెలంగాణలో మా అభిప్రాయాలకు అనుగుణంగా వ్యూహరచన ఉండాలని మేం కోరుకొంటున్నాం అని తెలంగాణా టీడీపీ నేత ఒకరు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇచ్చిందని, ఆంధ్రాకు అన్యాయం చేసిందనే భావన ఉందని, ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ భూస్థాపితం అయిపోయిందని, తెలంగాణాలో మాత్రం, ఆ పార్టీ తెలంగాణా ఇచ్చిందనే భావన ప్రజల్లో ఉందని, ఇప్పటికే 15 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి, పోరాడుతున్న పార్టీ, నిలదొక్కుకోవాలి అంటే, పొత్తులు తప్పవనే సంగతి, ఆంధ్రా నాయకులు అర్ధం చేసుకోవాలని అంటున్నారు. కాంగ్రెస్ ఎలాగూ ఆంధ్రాలో జీరో కాబట్టి, ఇక్కడ పొత్తు పెట్టుకున్నా, అక్కడ రాజకీయంగా ఏమి ఇబ్బంది ఉండదనే భావన, తెలంగాణా తెలుగుదేశం నాయకుల్లో ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read