గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్నో దారుణాలు చూస్తూ ఉంటాం. పేద ప్రజలను పీక్కు తింటూ, వారిని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే, రాను రాను ఈ పరిస్థితిలో మార్పులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇలాంటివి దాదపుగా తగ్గిపోయి, ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్ పై నమ్మకం ఏర్పడేలా చేసాయి. కొన్ని అజాగ్రత్తగా ఉన్న సంఘటనలు మినిహా, ఇలా ప్రజలు దగ్గర డబ్బులు గుంజటం అనేది తగ్గిపోయింది. కాని, ఈ రోజు జరిగిన సంఘటన చూసిన తరువాత, ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే బాధ కలగక మానదు. పేదలను పీక్కుతింటున్న ఇలాంటి వారు ఉన్నంత కాలం, ఇలాగే ఉంటుంది.
తాజగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిన సంఘటన మానవత్వం ఎలా మంటగలిసిందో చెప్పే సంఘటన ఇది. ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసినందుకు ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు వైద్యులు. శివప్రాసాద్ అనే ఆటోడ్రైవర్ గత శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారం రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన శివప్రసాద్ నిన్న మృతి చెందాడు. ఐదు వేలు ఇస్తేనే పోస్టుమార్టం సక్రమంగా చేస్తామని డాక్టర్ తేల్చిచెప్పారు. ఆయన దీనికి చెప్పిన కారణం తెలిస్తే, ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేసినా తప్పు లేదు అనిపిస్తుంది. ఇలాంటి అసంఘిటిత కార్మికులకు, చంద్రన్న భీమా ఇస్తున్న సంగతి తెలిసిందే.
దీన్నే సాకుగా చూపాడు ఆ డాక్టర్.. చంద్రన్న భీమాతో ఐదు లక్షల రూపాయలు మీకు వస్తున్నప్పుడు, మాకు ఐదు వేలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తారని డాక్టరే ప్రశ్నించారు. దాంతో అసలుకే మనిషి పోయి బాధలో ఉన్న బంధువులు, డబ్బులకి పీక్కుతింటు ఉండటంతో, వారికి ఏమి చెయ్యాలో తెలియక, స్థానిక ఎమ్మెల్యే బొండా వద్దకు వెళ్లి తమగోడు వెళ్లబోసుకున్నారు. దీంతో స్వయంగా ఎమ్మెల్యే బొండా ఉమ, ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చి సిబ్బందిని మందలించడంతో శవాన్ని పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఆ డాక్టర్ పై చర్య తీసుకునే విధంగా, సియంకు ఫిర్యాదు చేస్తానని, ఎమ్మల్యే చెప్పారు.