Sidebar

02
Fri, May

ఒక బాధ్యత లేని వ్యక్తి ప్రవర్తన, మన నిజ జీవితాల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం... విచక్షణ లేకుండా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఇలాగే ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా అంటూ, విపరీత మనస్తత్వం కలవారాని, మనం ఎంతో మందిని మన జీవితంలో చూస్తూ ఉంటాం... కాని, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఒక పెద్ద సినీ హీరో అయ్యిండి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ బ్రతికేస్తున్నాడు... ఇక్కడ సమస్య పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు.... ఇలా పవన్ కళ్యాణ్, గాలిగా ట్విట్టర్ లో పోస్టులు పెడుతుంటే, అదే రకమైన భావజాలంతో ఉన్న తన ఫాన్స్ ఇంకా రెచ్చిపోతారు.. సమాజంలో ఇప్పటికే, విచ్చలవిడితనం పెరిగిపోయి ఉంది.. పవన్ లాంటి వాడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే, ఇంకా తన ఫాన్స్ ఎలా రెచ్చిపోతారో అర్ధమవుతుంది... ఇలాంటి విపరీత ప్రవర్తనకు, పవన్ కళ్యాణ్ కు కొన్ని మీడియా సంస్థలు నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే.

pk 24082018

ఆంధ్రజ్యోతి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో పవన్‌ కల్యాణ్‌కు సమన్లు జారీ అయ్యాయి. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పవన్‌పై ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రూ.10కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి, స్వయంగా లేదా న్యాయవాది ద్వారా ఈ నెల 24న కోర్టుకు హాజరు కావాలని హైదరాబాద్‌ సిటీ సివిల్‌కోర్టు 3వ అదనపు చీఫ్‌ జడ్జి పవన్‌ను ఆదేశించారు. అయితే పవన్ కంటి ఆపరేషన్ చేసుకోవటంతో, పవన్ తరుపున ఆయన లాయర్ కోర్ట్ కు వెళ్లారు. సందర్భంగా పవన్‌ తరపు న్యాయవాది కె.చిదంబరం వకాలత్‌ దాఖలు చేశారు. అభియోగాల నమోదు కోసం గడువు ఇస్తూ జడ్జి అక్టోబరు 26కు కేసు విచారణను వాయిదా వేశారు.

pk 24082018

సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ ఫిలిం చాంబర్‌ ఎదుట సినీ నటి శ్రీరెడ్డి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీని పై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి మండిపడ్డారు. ఆయనను తీవ్రంగా దూషించింది. ఆ దూషణలో పవన్‌ తల్లిని కించపరిచే పదం వాడారు. ఈ ఎపిసోడ్ ను రాజకీయంగా వాడేసాడు పవన్‌ కల్యాణ్‌.. ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తరువాత, చంద్రబాబు తన పుట్టిన రోజు నాడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షను డైవర్ట్ చెయ్యటానికి ఏప్రిల్‌ 20 తెల్లవారు జాము నుంచి 23 వరకు ట్విటర్లో అనుచిత ట్వీట్లు చేశారు. ఎవరో శ్రీ రెడ్డి అనే అమ్మాయి తిడితే, ఇదంతా చంద్రబాబు , లోకేష్, కొన్ని మీడియా సంస్థలతో కలిసి, ఇవన్నీ చేపిస్తున్నారని, రాజకీయం మొదలు పెట్టాడు.

pk 24082018

ట్వీట్‌తో పాటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫ్యామిలీ ఫొటోను కూడా ట్విటర్లో ఉంచారు. దీంతో, పవన్‌ కల్యాణ్‌ పై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ఆ ట్వీట్లు నిరాధారమని, తన, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా అవి ఉన్నాయని, వాటిని ఉపసంహరించుకోవాలని, ఆయన ఏ సామాజిక మాధ్యమం ద్వారా ఆరోపణలు చేశారో దాని ద్వారానే క్షమాపణలు చెప్పాలని తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసులు పంపించారు. పవన్‌ నుంచి స్పందన లేకపోవడంతో.. రాధాకృష్ణ రూ.10 కోట్లకు పవన్‌పై పరువు నష్టం దావా వేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read