ఎవరైనా ఈ రోజుల్లో డబ్బుతో రాజకీయం చెయ్యటం సహజం. ఇంకా చెప్పాలి అంటే డబ్బు ఉన్నాడికే టికెట్లు ఇచ్చే పరిస్థితి. ఇందులో ప్రజల దగ్గర నుంచి రాజకీయ పార్టీల దాకా అందరికీ బాధ్యత ఉంది. అయితే, నేను డబ్బు ఇచ్చాను అంటూ, ఏకంగా ఆ పార్టీనే బ్లాకు మెయిల్ చెయ్యటం ఎప్పుడూ చూడలేదు. అదీ జగన్ లాంటి నేతలను బెదిరించటం అంటే, ఆశ్చర్యం కలగక మానదు. వైసీపీ అధినేత జగన్‌ విశాఖ జిల్లాలో పర్యటిస్తుండగానే... అదే జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు ‘సోషల్‌ మీడియా’ వేదికగా రచ్చకెక్కాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

jagan 200082108 2ఇందులో భాగంగా ఆదివారం ఎలమంచిలి నేతలు, కార్యకర్తలతో మునగపాకలో సమావేశం నిర్వహించారు. తొలుత నియోజకవర్గం మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. తర్వాత మైకు తీసుకున్న కన్నబాబురాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ఎన్నికల్లో జిల్లాలో ఎవరూ ఇవ్వనంత డొనేషన్‌ను జగన్‌కు ఇచ్చాను. ఇక్కడ ఎవరు ఎటువంటివారో నాకు తెలుసు. ఎవ్వరి మాటా లెక్కచేయను. ఎవరెన్ని చెప్పినా నా స్టైల్‌ మారదు. ఎన్నికల్లో ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు’’ అని అన్నారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు.

jagan 200082108 3రెండు రోజుల క్రితం విజయసాయి సమక్షంలో ఇలాంటి గొడవే జరిగింది. విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో సీనియారిటీపై తంగేడు రాజులకు, మండల పార్టీ అధ్యక్షుడికి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే సభలో జరిగిన గొడవను విలేకరులు ఫొటోలు, వీడియోలు తీయగా...విజయసాయిరెడ్డి వెనుక ఉన్న కొంతమంది సభ్యులు సెల్‌ను లాక్కొని ఫొటోలను దౌర్జన్యంగా తొలగించారు. దీని పై విలేకరులు భగ్గు మంటున్నారు. విజయసాయిరెడ్డి ఉండగానే, ఇంత జరిగినా, ఆయన ఏమాత్రం వాళ్ళని ఆపలేదని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సమక్షంలో , మీడియా పై దాడి చేసి, ఫూటేజ్ ధ్వంసం చేస్తే, కనీసం విజయసాయి వాళ్ళని ఆపలేదని విలేకరులు బాధపడుతున్నారు. దీని పై చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read