నర్సీ వట్నం డాక్టర్ సుధాకర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. తనకు సరైన వైద్యం అందించడం లేదని సంబంధంలేని మందులు ఇవ్వడంతో ఆరోగ్యం దెబ్బతింటోందని ఇటీవల సుధాకర్ ఏపీ హైకోర్టుకు లేఖ రాసిన విషయం విధితమే. వైద్య సేవలందిస్తున్న డాక్టర్‌పై అభ్యంతకరం తెలపడంతో ఆసుపత్రి సూరింటిండెంట్ డాక్టర్ రాధారాణి ఇప్పటి వరకూ సుధాకరకు వైద్యం అందిస్తున్న రామిరెడ్డిని మార్చి ఆయన స్థానంలో మరో వైద్యురాలిని నియమించారు. డాక్టర్ రాధారాణి పర్యవేక్షణలో డాక్టర్ మాధవీలత సుధాకరకు వైద్య సేవలందించనున్నారని ఆనుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా డాక్టర్ సుధాకర్‌కు మరో రెండు వారాల పాటు చికిత్స అందించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తన మానిసిక పరిస్థితి బాగుందని డాక్టర్ సుధాకర్ చెప్తున్నప్పటికీ ఆయన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు.

దీనిపై కుటుంబ సభ్యులతో చర్చించిన వైద్యులు సుధాకర్ ను ఇద్దరు కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ప్రత్యేక గదిలో ఉంచి వైద్య సేవలందించడానికి నిర్ణయించాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా డాక్టర్ సుధాకర్ కేసు విషయమై హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ రెండవ రోజు తన దర్యాప్తును షురూ చేసింది. ఆదివారం కేజీహెచ్ కు చేరుకున్న సీబీఐ అధికారులు సుధాకరకు వైద్య సేవలందించిన డాక్టర్లు, హౌస్ సర్జన్ల నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అంతేగాకుండా కొన్ని రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అంతే గాకుండా ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఆనువత్రి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్లో సిబ్బందిని విచారించేందుకు సిద్ధమయ్యారు. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎఎస్ఐతో పాటు ఆరుగురు కాని స్టేబుళ్లపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మానవహక్కుల ఉల్లంఘన నేరం కింద, పర్యవేక్షక బాధ్యతలు చేపట్టిన వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ రోజు విచారణ జరిగింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‍కు నివేదిక సమర్పించారు, విశ్రాంత న్యాయమూర్తి బి.శేషయానారెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ సభ్యులు. స్టైరీన్ గ్యాస్ లీకేజీ మానవ తప్పిదం అని, భద్రతా ప్రమాణాల వైఫల్యం కూడా దీనికి తోడయ్యి, సంస్థ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని నివేదికలో విచారణ కమిటీ పేర్కొంది. నివేదిక పై అభ్యంతరాలను ఒక్కరోజులో చెప్పాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎల్జీ పాలిమర్స్ ని కోరింది. నేడు సాయంత్రం లేదా రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఎల్జీ పాలిమర్స్ తరపున వాదనలు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్ర వినిపించారు. గ్యాస్ లీకేజీ ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు లేదని వాదనలు వినిపించారు ఎల్జీ పాలిమర్స్ తరపున న్యాయవాది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారణ చేపట్టే అంశం పై సుప్రీం కోర్టులో పెండింగ్‍లో ఉందని ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాది, ఎన్జీటీకి చెప్పారు. 2001 నుంచి అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ వాదనలు వినిపించారు. గ్యాస్ లీకేజీ ఘటనలో బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోలని శర్మ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను కోరారు. తన పిటిషన్‍ను పరిగణనలోకి తీసుకుని నోటీసులు ఇవ్వాలని ఈఏఎస్ శర్మ కోరారు. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ విషయం పై, కేంద్ర, రాష్ట్రం, హైకోర్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహా, 7 సంస్థలు, జరిగిన ఘటన, పై విచారణ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం పై, హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో, ఎల్జీ పాలిమర్స్ డిఫెన్సు లో పడిన సంగతి తెలిసిందే.

ఒక పక్క క-రో-నా రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. మరో పక్క ఆర్ధిక కష్టాలు, రాష్ట్రాన్ని కబళించి వేస్తున్నాయి. ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో, చతికిలపడిన రాష్ట్ర ప్రగతి, కరోనాతో పూర్తిగా పడుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇప్పటికే 87 వేల కోట్లు అప్పు చేసింది. ఇక అప్పులు పెద్ద మొత్తంలో పుట్టాలి అన్నా, కష్టమయ్యే పరిస్థితి. కేంద్ర సహకారం అంతో ఇంతో ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరి ఆడుతుంది, లేకపోతే ఎప్పుడో చేతులు ఎత్తేసేది. ఇక మరో పక్క, కోర్టుల్లో ఎదురు దెబ్బలు. అనాలోచితంగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టు తప్పు బడుతుంది. మరో పక్క ఎలక్షన్ కమీషనర్ వివాదం. మరో పక్క వివేక కేసు, డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐకి ఇవ్వటం. మరో పక్క తనకు ఇష్టం లేని ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నా, కోర్టు తీర్పులతో మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇంత గందరగోళం మధ్య రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. 151 సీట్లు వచ్చి రాజకీయంగా బలంగా ఉన్నా, అవగాహన లేమితో, అహంకార ధోరణితో, కోరి తెచ్చుకున్న కష్టాలు ఇవి.

ఇన్ని అవరోధాల మధ్య, కేంద్ర సహకారం కోసం, జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, ఆసక్తి రేపుతుంది. కరోనా సహాయం కోసం, లేకపోతే మరో ఇతర సహాయాల కోసం అయితే, వీడియో కాన్ఫరెన్స్ లో, మాట్లాడవచ్చు. ఇప్పటికే ప్రధాని కాని, హోం మంత్రి కాని అలాగే మాట్లాడారు. అయితే రేపు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి, అమిత్ షా ని కలుస్తారని, అలాగే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కలుస్తారనే వార్తలు, వింటుంటే, ఇది కరోనా సహాయం కోసం కాదని, మరేదో ఉంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారని, కాని మోడీని కలిసే అవకాశం లేదని తెలుస్తుంది. మరి ఇంత అర్జెంటుగా, ఢిల్లీ వెళ్లి, అమిత్ షా ని కలిసేది, రాష్ట్రానికి సహాయం కోసమా, ప్రత్యెక హోదా, విభజన హామీల కోసమా, లేక ఇంకా ఏదైనా ఉందా అనేది, రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తే కాని, తెలిసే పరిస్థితి లేదు.

వైసీపీలో నెంబర్ 2 నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆసక్తికరంగా మారాయి. జగన్ కు, విజయసాయి రెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. జగన్ జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి, ఇప్పటి వరకు, అన్నీ తానై విజయసాయి రెడ్డి నిర్వహిస్తున్నారు. అయితే, ఈ రోజు విజయసాయి రెడ్డి జగన్ తో తనకు ఉన్న రేలషన్ గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. నాకు, మా అధ్యక్షుడు జగన మోహన్ రెడ్డి గారికి, ఎలాంటి విబేధాలు లేవని విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. నేను చనిపోయేంత వరకు జగన్, ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉంటానని, విజయసాయి రెడ్డి అన్నారు. జగన్ తో ఎలాంటి విబేధాలు లేవు, భవిష్యత్తులో కూడా రావు అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్య, సజ్జల రామకృష్ణా రెడ్డి పేరు ఎక్కువ తలుస్తూ ఉండటంతో, ఇలా ఏమైనా అనుకుని, విజయసాయి రెడ్డి, ముందుగానే ఇలా ప్రకటించారా అనేది తెలియాలి.

సహజంగా ఇలాంటి పెద్ద నాయకులు, ఇలాంటి ప్రకటన చెయ్యరు. మరి విజయసాయి రెడ్డి ఎందుకు ఇలా వ్యాఖ్యానించారు, అనేది చూడాలి. ఇక మరో పక్క, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టినందుకు హైకోర్టు నుంచి నోటీసులందుకున్న వారందరికీ తాను అండగా ఉంటానని విజయసాయి రెడ్డి అన్నారు. తాను మొదటి నుంచి సోషల్ మీడియా చూసుకుంటున్నానని, ఏది జరిగినా, తమ కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. కావాలని అలా కోర్టుల పై వ్యాఖ్యలు చెయ్యలేదని, తెలుగుదేశం వారు రెచ్చగొట్టటంతో అలా చేసి ఉంటారని అన్నారు. ఇందులో కూడా, ఎంత మంది ఫేక్ ఎకౌంటులతో, తమ పై ఇలా కుట్ర పన్నారో, చూడాల్సి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఇక నిమ్మగడ్డ పై కూడా విజయసాయి రెడ్డి, విమర్శలు చేసారు. నిమ్మగడ్డ రాసిన లేఖ, తెలుగుదేశం వాళ్ళు పంపించిందే అని విజయసాయి రెడ్డి అన్నారు.

Advertisements

Latest Articles

Most Read