ఎప్పుడూ శాంతంగా ఉండే డిప్యూటీ స్పీకర్‌ మండలి ‘బుద్ధ’ప్రసాద్‌కు కోపమొచ్చింది. అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్ట్‌ డిప్యుటేషన్‌ విషయంలో డీసీహెచ్‌ఎస్‌ (డిస్ట్రిక్ట్‌ కో-ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌) జ్యోతిర్మయి వ్యవహారశైలిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బుద్ధప్రసాద్‌ గైనకాలజిస్ట్‌ డిప్యుటేషన్‌ విషయంలో జరిగిన వివరాలు తెలియజేశారు. ఏరియా ఆసుప్రతికి ఇటీవలే వచ్చిన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ నాగలక్ష్మిని మూడు రోజుల క్రితం మచిలీపట్నానికి డిప్యుటేషన్‌ ఇచ్చిన విషయాన్ని అభివృద్ధి కమిటీ సభ్యులు చెప్పడంతో.. ఆపాలని కలెక్టర్‌కు సూచించానన్నారు. ఆయన వెంటనే రద్దు చేస్తున్నట్లు మెసేజ్‌ చేశారని తెలిపారు.

buddha 220820182

పాముకాటు బాధితులను పరామర్శించడానికి వచ్చిన డీసీహెచ్‌ఎస్‌. నాగలక్ష్మిని రిలీవ్‌ ఎందుకు చేయలేదని అడగటమే కాకుండా రాజకీయ ఒత్తిడి తీసుకువస్తారా.. అంటూ అనుచితంగా మాట్లాడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్‌ ఆదేశాలను పక్కనపెట్టి.. రిలీవ్‌ ఎందుకు చేయరంటూ డీసీహెచ్‌ఎస్‌ ఒత్తిడి చేయడం దురదృష్టకరమన్నారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాననీ, వెంటనే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిపానన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య జరిగిన ఘటనపై విచారణ నిర్వహిస్తున్నారనీ, ఉదయం ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేసినట్లు చెప్పారు. డిప్యుటేషన్‌ వేసే అధికారం డీసీహెచ్‌ఎస్‌కు లేదని మాలకొండయ్య చెప్పారన్నారు.

buddha 22082018 3

అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి రోగులు రావటంలేదా..?ఇక్కడి వారు ప్రజలు కాదా, అంటూ డీసీహెచ్‌ఎస్‌ను ప్రశ్నించారు. గతేడాది ఆసుపత్రికి 70వేల 201 మంది రోగులు వచ్చారనీ, ఈ ఏడాది ఇప్పటి వరకూ 43 వేల మంది వచ్చారని తెలిపారు. అధికారులు మంచిచేస్తే నెత్తిన పెట్టుకుంటాననీ, ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తొలిసారిగా అధికారపక్షం రోడ్డెక్కే పరిస్థితి తీసుకువచ్చారనీ, అవసరమైతే తానే రోడ్డెక్కుతానని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి 24 గంటలూ కష్టపడితే చాలదనీ, అధికారులంతా పనిచేయాలన్నారు. ప్రత్యేకాధికారులపై గురుతర బాధ్యత ఉందనీ, ప్రతి రోజూ పరిశీలిస్తుంటాననీ, చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read