ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి... మొన్నటి దాక, తెలుగుదేశం పార్టీతో ఉన్న పవన్ కళ్యాణ్, సడన్ గా ప్లేట్ మార్చేసారు... మోడీని ఒక్క మాట అనకుండా, ప్రత్యెక హోదా పై, విభజన అంశాల పై ఏమి చేస్తాడో చెప్పకుండా, కేవలం రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబునే టార్గెట్ చేస్తూ, గత నాలుగు నెలలుగా పవన్ హంగామా చేస్తున్నాడు... మోడీని ఒక్క మాట అనకుండా, కేంద్రం పై ఎదురు తిరుగుతున్న చంద్రబాబుని ఎందుకు నిందిస్తున్నారో, పవన్ ఎజెండా ఏంటో అని ప్రజలు అనుకుంటున్నారు... అయితే ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట అని, కేవలం తనకి ఎదురు తిరిగాడు అనే కసితో, చంద్రబాబు పై అన్ని అస్త్రాలని ప్రయోగిస్తుందని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా, ఇప్పుడు ఈ ముసుగు ఆటలు లేకుండా, పవన్, జగన్, బీజేపీ బహిరంగగా కలిసి, చంద్రబాబు పై దాడి చెయ్యటానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, వైసీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ఒక అవగాహానకు వచ్చేసాయి. ఈ రోజు వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ఇవన్నీ అవును అనే సమాధానం వస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజన్ ఉన్న నాయకుడని తిరుపతి వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ కితాబిచ్చారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే జనసేన, వైసీపీ కలుస్తాయని చెప్పారు. ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేస్తాయని పునరుద్ఘాటించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి తాను తిరుపతి ఎంపీగా పోటీ చేశానని, అప్పుడు పవన్ను దగ్గరగా గమనించానని, సమాజం పట్ల ఆయనలో బాధ్యత కనిపిస్తోందని తెలిపారు.
ప్రజానేతగా జగన్.. ప్రజా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. వైసీపీలో విశ్వాసంగా పనిచేస్తున్నానని, ఈసారి కూడా తిరుపతి నుంచి పోటీకి తనకే అవకాశం రావచ్చని అభిప్రాయపడ్డారు. వరప్రసాద్, పవన్ కల్యాణ్ స్నేహితులన్న సంగతి తెలిసిందే. తాజాగా వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ వైసీపీకి మద్దతిస్తారని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బాగా అవినీతి చేస్తున్నారని, అందుకే జగన్ తో కలిసి వెళ్లి, చంద్రబాబుని ఓడించాలి అని పవన్ చెప్పినట్టు, వరప్రసాద్ గతంలో కూడా మీడియాతో చెప్పారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. కేవలం, రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని అన్నందుకు, బీజేపీ, పవన్, జగన్, ఇలా ఎగబడుతూ, చంద్రబాబుని దించటానికి నానా అవస్థలు పడుతున్నారు.